iDreamPost

దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ కీర్తి భట్! కన్నీటితో పోలీస్ కంప్లైంట్!

  • Published Mar 30, 2024 | 1:56 PMUpdated Mar 30, 2024 | 1:56 PM

ఈ మధ్య కాలంలో సైబర్ కేటుగాళ్లు కొత్తరకం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ సైబర్ కేటుగాళ్ల చేతిలో సామన్య ప్రజలతో పాటు ఒక్కక్కసారి సెలబ్రిటీస్ కూడా బలైపోతున్నారు. తాజాగా ఈ సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని ఓ నటి బలైపోయింది. కేవలం ఒక్క లింక్ క్లిక్ చేసిన పాపానికి తన అకౌంట్ లో లక్షలు రూపాయల్నిదోచేశారని తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఇంతకి ఆ నటి ఎవరంటే..

ఈ మధ్య కాలంలో సైబర్ కేటుగాళ్లు కొత్తరకం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ సైబర్ కేటుగాళ్ల చేతిలో సామన్య ప్రజలతో పాటు ఒక్కక్కసారి సెలబ్రిటీస్ కూడా బలైపోతున్నారు. తాజాగా ఈ సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని ఓ నటి బలైపోయింది. కేవలం ఒక్క లింక్ క్లిక్ చేసిన పాపానికి తన అకౌంట్ లో లక్షలు రూపాయల్నిదోచేశారని తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఇంతకి ఆ నటి ఎవరంటే..

  • Published Mar 30, 2024 | 1:56 PMUpdated Mar 30, 2024 | 1:56 PM
దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ కీర్తి భట్! కన్నీటితో పోలీస్ కంప్లైంట్!

ఈ మధ్య కాలంలో సైబర్ కేటుగాళ్లు కొత్తరకం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది తరుచుగా ఆన్ లైన్ షాపింగ్ లను చేస్తూంటారు. ఈ క్రమంలోనే ఎన్నో కొరియర్స్ ను తీసుకోవడమో, ఇవ్వడం వంటి ప్రక్రియ జరుగుతు ఉంటుంది. వీటినే అసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో ప్రజలను మోసం చేస్తూ లక్షల రూపాయల నగదును కొల్లగొడుతుంటారు. అయితే ఈ సైబర్ కేటుగాళ్ల చేతిలో సామన్య ప్రజలతో పాటు ఒక్కక్కసారి సెలబ్రిటీస్ కూడా బలైపోతున్నారు. తాజాగా ఈ సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని ఓ నటి బలైపోయింది. కేవలం ఒక్క లింక్ క్లిక్ చేసిన పాపానికి తన అకౌంట్ లో లక్షలు రూపాయల్నిదోచేశారని తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఇంతకి ఆ నటి ఎవరంటే ..

ఈ మధ్యకాలంలో సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా ఫ్రాడ్ ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి కీర్తి భట్ కూడా ఈ సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్నారు. ఇక ఆమె ఎదుర్కొన్న ఆ సైబర్ క్రైమ్ గురించి తెలిస్తే.. ఇలా కూడా మోసాలకు పాల్పడతారా అని ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం ఒక్క లింక్ క్లిక్ చేసిన పాపానికి తన అకౌంట్ లో లక్షల రూపాయల్ని దోచేశారు ఈ సైబర్ నేరగాళ్లు. ఇక తాజాగా ఓ వీడియోలో కీర్తి భట్ తను ఎదుర్కొన్న సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఈ వీడియో చేస్తుంది మిమ్మల్ని ఎంటర్ టైన్మెంట్ చేయడానికి కాదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్ రేపు మీకు రాకూడదనే చేస్తున్నాం. ఎందుకంటే..డబ్బులనేవి ఎవరికి ఊరుకనే రావు. ఒక మనిషి బతకడానికి డబ్బు చాలా అవసరం. మరి అలాంటి డబ్బును కేవలం ఒక్క లింక్ ద్వారా లాగేశారు కొందరు సైబర్ నేరగాళ్లు.

అసలేం జరిగిందంటే..నాకు ఒక కొరియర్ రెండురోజుల్లో రావాల్సి ఉండగా.. వారం అయినా రాలేదు. దీంతో నేను మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశాను. వాళ్లు డెలివరీ చేశాం.. మెహిదీపట్నంలో ఉందని చెప్పారు. ఇక ఆ తర్వాత నాకు హిందీలో ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ లో.. మీకు ఒక కొరియర్ రావాలి కదా, అది ఇంకా రీచ్ కాలేదు కదా అని అడిగారు. అవును రాలేదు అని చెప్పాడంతో.. మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు, వెంటనే వాట్సాప్‌లో మీ ఫుల్ అడ్రస్ పంపించండి అని నెంబర్ పెట్టారు. నేను కాల్ లో ఉండే అడ్రస్ ను అప్డేట్ పంపించగా.. వాళ్లు అది చెక్ చేసి అప్డేట్ కాలేదని నార్మల్ నెంబర్ కి మెసెజ్ చేయమన్నారు. దీంతో నేను నార్మల్ నెంబర్ తో మెసెజ్ చేస్తే నా రిజిస్టర్ నెంబర్ కు లింకు వచ్చింది. దాన్ని క్లిక్ చేసి ఆ లింక్ ఫార్వర్డ్ చేసి వాళ్లికి పంపామన్నారు.  అలా అడ్రస్ అప్డేట్‌కి రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని అన్నారు. ఇక రెండు రూపాయిలే కదా అని నేను సరేనన్నాను. తర్వాత యూపీఐ మెన్షన్ చేయమని అనడంతో.. నాకు డౌట్ వచ్చి చేయనని చెప్పాను. అప్పుడు వాళ్లు బ్యాంక్‌కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఇదేనా అని అడిగారు. ఇదే అని చెప్పాడంతో.. నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ వచ్చింది. మేడమ్ మీకు కాసేపు ఆగి అప్డేట్ ఇస్తాం అని అన్నారు.

అయితే వారు ఫోను కట్ చేసిన కాసేపికి నా అకౌంట్ లో రెండు రూపాయిలు కట్ అయ్యింది. ఆ తర్వాత .. సరిగ్గా 12 గంటలకు రూ.99వేలు కట్ అయ్యింది. ఆ వెంటనే మళ్లీ మరో రూ.99వేలు కట్ అవ్వడంతో నేను బ్యాలన్స్ చెక్ చేస్తే రెండు లక్షలు కట్ అయినట్టు చూపించింది. వెంటనే నేను నా భర్త కార్తిక్ ఫోన్ చేశాను. అలాగే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేశాను. ఆ తర్వాత సైబర్ కంప్లైంట్ ఇచ్చి.. నా అకౌంట్ బ్లాక్ చేయించాను అని చెప్పారు. కనుక ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలు మీకు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని’ కీర్తి భట్ హెచ్చరిస్తూ ఈ వీడియోను విడుదల చేశారు. మరి, కోరియర్ రూపంలో సైబర్ నేరగాళ్ల వలలో కీర్తి భట్ డబ్బులు పొగొట్టున్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి