iDreamPost

Bigg Boss Arya: నన్ను వదిలించుకోవడానికే బిగ్​బాస్​కు పంపాడు.. నటి షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 02, 2024 | 10:20 AMUpdated Feb 02, 2024 | 10:20 AM

బిగ్​బాస్​ ద్వారా పాపులరైన ఓ నటి తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను వదిలించుకోవడానికే బిగ్​బాస్​ హౌస్​కు పంపాడని తెలిపింది.

బిగ్​బాస్​ ద్వారా పాపులరైన ఓ నటి తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను వదిలించుకోవడానికే బిగ్​బాస్​ హౌస్​కు పంపాడని తెలిపింది.

  • Published Feb 02, 2024 | 10:20 AMUpdated Feb 02, 2024 | 10:20 AM
Bigg Boss Arya: నన్ను వదిలించుకోవడానికే బిగ్​బాస్​కు పంపాడు.. నటి షాకింగ్ కామెంట్స్!

మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటీమణుల్లో ఒకరు ఆర్య. టెలివిజన్ నటిగా కెరీర్​ను స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత మలయాళంలో చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అంతేగాక మలయాళ బిగ్​బాస్​ సీజన్-2లో కంటెస్టెంట్​గానూ పాల్గొంది. అలాగే బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ వంటి పలు రియాలిటీ షోల్లోనూ మెరిసింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్​తో పాటు జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను ఆమె పంచుకుంది. లైఫ్​లో తాను ఎదుర్కొన్న సమస్యలు, భర్త రాహుల్ సుశీలన్​తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత డివోర్స్​ మీద రియాక్ట్ అయింది.

‘ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నా. నన్ను వదిలించుకోవడానికి ఆయన నన్ను బిగ్​బాస్​కు పంపారనే అనుమానం కలుగుతోంది. నాకు ఒక కూతురు ఉంది. మా నాన్న చనిపోయి అప్పటికి ఎక్కువ రోజులు కాలేదు. అయినా బిగ్​బాస్​కు వెళ్లమని ఆయన సపోర్ట్ చేసి మరీ ఎయిర్​పోర్టులో దింపారు. బిగ్​బాస్​లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ నాకు పరిచయం లేదు. అయితే హౌస్ నుంచి వచ్చేలోపు నాకు దూరమవ్వాలనేది ఆయన ప్లాన్ అని నాకు తెలీదు. దీన్ని ఓ ఛాన్స్​గా తీసుకున్నారు. కరోనా వల్ల నేను బిగ్​బాస్​ నుంచి తిరిగొచ్చి నా భర్తకు కాల్ చేశా. కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు’ అని ఆర్య చెప్పుకొచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. తనకు ఏం చేయాలో పాలుపోలేదని పేర్కొంది. దీంతో ఆయన సోదరికి కాల్ చేశానని తెలిపింది.

He sent me to Bigg Boss to get rid of me!

‘నా భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆయన సోదరికి కాల్ చేశా. అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ ఆమె నాకు చెప్పింది. ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని అప్పుడే నాకు తెలిసింది. దీంతో ఆయన్ను కాల్చి చంపాలనేంత కోపం నాకు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి కోపం లేదు. కానీ ఆయనకు ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం చాలా సంతోషిస్తా’ అంటూ రాహుల్ సుశీలన్​పై తనకు ఉన్న కోపాన్ని బయటపెట్టింది ఆర్య. కొవిడ్ సమయంలో రాహుల్ దుబాయ్​లో ఉండటంతో ఆయన్ను కలవలేకపోయానని ఆర్య పేర్కొంది. కాగా.. చివరగా ‘క్వీన్ ఎలిజబెత్’ అనే మలయాళ కామెడీ చిత్రంలో నటించింది ఆర్య. ఎం. పద్మకుమార్ తెరకెక్కించిన ఈ ఫిల్మ్​లో శ్వేతా మీనన్​తో పాటు నరేన్, జానీ ఆంటోనీ, నీనా కురుప్ యాక్ట్‌ చేశారు. ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించారు. మరి.. బిగ్​బాస్​ ఆర్య డివోర్స్​ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:
Ambajipeta Marriage Band Review: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ రివ్యూ!
Sankarabharanam Movie: శంకరాభరణం చిత్రానికి 44 ఏళ్ళు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి