iDreamPost

మంజుమ్మల్ బాయ్స్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి

తమ అందచందాలతో ఎంటర్ టైన్ చేస్తోన్న ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతున్నారు. రకుల్, కృతి, తాప్సీ పన్ను ఇప్పటికే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా.

తమ అందచందాలతో ఎంటర్ టైన్ చేస్తోన్న ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతున్నారు. రకుల్, కృతి, తాప్సీ పన్ను ఇప్పటికే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా.

మంజుమ్మల్ బాయ్స్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి

ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఫిబ్రవరిలో టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని మనువాడింది. మార్చిలో ముగ్గురు ముద్దుగుమ్మలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసి.. బాలీవుడ్ బాట పట్టిన కృతి కర్బంద గత నెలలో వివాహం చేసుకుంది. మరో టాలీవుడ్ సోయగం సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కూడా తన ప్రేమికుడ్ని అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకుంది. తమిళ డబ్బింగ్ సినిమా గుడ్ నైట్ మూవీతో కుర్రాళ్ల క్రష్ గా మారిపోయిన మీతా రఘునాద్ కూడా ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ కోవలోకే చేరింది మరో హీరోయిన్.

మెగా నట వారసుల్లో ఒకరైన వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆదికేశవ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ బ్యూటీ అపర్ణాదాస్. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. వజ్రాగా మంచి నటన ప్రదర్శించింది. ఇప్పుడు ఈ నటి పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ మాలీవుడ్ నటుడు.. దీపక్ పరంబోల్ ను అత్యంత నిరాడంబరంగా.. వివాహం చేసుకుంది. బుధవారం కేరళలోని గురువాయుర్ టెంపుల్లో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు, కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు హల్డీ, సంగీత్ ఫోటోలను షేర్ చేసుకుంది అపర్ణా దాస్. ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు సినీ సెలబ్రిటీలు.. అభిమానులు.

aparna das marriage

ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి. ఇందులో ఏడుగురు స్నేహితుల్లో ఒకడిగా నటించాడు దీపక్. మలర్వాడీ ఆర్ట్స్ క్లబ్ చిత్రంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దీపక్.. మంజుమ్మల్ బాయ్స్ చిత్రంతో పాపులర్ తెచ్చుకున్నాడు. ఇక అపర్ణా దాస్.. న్జన్ ప్రకాశన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మనోహరం గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో బీస్ట్ చిత్రంలో నటించింది. దాదా, తెలుగులో ఆదికేశవతో మెప్పించింది. ఇటీవల మలయాళంలో సీక్రెట్ హోం అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు ఆనంద్ శ్రీబాల అనే చిత్రంలో యాక్ట్ చేస్తుంది. దీపక్ చేతిలో కూడా ఓ మలయాళ ప్రాజెక్ట్ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Wedding Photographer – Elementricx (@momentssbyelementricx)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి