iDreamPost

Bigg Boss 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి క్రేజీ రెస్పాన్స్!

Bigg Boss 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి క్రేజీ రెస్పాన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. అదేంటి.. స్టార్ట్ రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే సూపర్ సక్సెస్ అని ఎలా చెప్తారు అంటారా? అయితే ఊరికే అలా చెప్పడం లేదండోయ్. అందుకు కొన్ని లెక్కలు ఉన్నాయి. వాటి ఆధారంగానే ఇప్పుడు సీజన్ సూపర్ సక్సెస్ అని చెప్తున్నాం. సాధారణంగా బిగ్ బాస్ అనగానే సీజన్ చూసేవాళ్లు.. వ్యతిరేకించేవాళ్లు ఉంటారు. అయితే ఈ సీజన్ తర్వాత ఆడియన్స్ సంఖ్యే ఎక్కువగా ఉంది. అన్ని సీజన్స్ తో పోలిస్తే.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సీజన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టార్ట్ అయిన రెండు వారాల వ్యవధిలోనే ఇంత రెస్పాన్స్ సొంతం చేసుకుంటే.. ఆట ముందుకు సాగేకొద్దీ అది మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సీజన్ ని కూడా అక్కినేని నాగార్జున హోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జున.. ఈ సీజన్ లో కూడా ది బెస్ట్ హోస్ట్ అనిపించుకుంటున్నాడు. ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టాగా ఉంటుందని ముందు నుంచే చెబుతున్నారు. అయితే ఎంత ప్రమోట్ చేసినా కూడా ఈసారి సీజన్ కి అంత బజ్ క్రియేట్ కాలేదని ముందు నుంచి టాక్ ఉంది. అయితే నిజానికి ఆ టాక్ నిజం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి సీజన్ గ్రాండ్ లాంఛ్ ప్రోమోకి 18.1 టీవీ రేటింగ్ వచ్చింది. అలాగే ఆ ఎపిసోడ్ కి 51 మిలియన్ మినిట్స్ వ్యూవర్ షిప్ వచ్చింది. అంటే టీవీ షోలలో అత్యధిక రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లో ఇది సెకండ్ హైఎస్ట్ లాంఛింగ్ డే రేటింగ్ అని చెప్పచ్చు.

అయితే ఈ ఒక్కటే కాదండోయ్.. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ 60 శాతం పెరిగారంట. బిగ్ బాస్ వ్యూయర్ షిప్ కూడా అదే రేంజ్ లో ఉందంట. మొదలైన రెండు వారాలలోపే ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తే.. గేమ్ కొనసాగే కొద్దీ ఈ రీచ్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ కు ఇంత క్రేజ్ రావడానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా కారణం అనే చెప్పాలి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ ఫైట్ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి రీచ్ బాగా పెరిగింది. అలాగే హౌస్ లో టాస్కులు, ఉల్టా పుల్టా డెసిషన్స్ వల్ల కూడా ఈ సీజన్ కు క్రేజ్ పెరిగింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా విజయం సాధించడం కోసం చాలా బాగా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు తమ గేమ్ మీద ఫోకస్డ్ గా ఉన్నారు.

ముఖ్యంగా రతికా రోజ్, శోభాశెట్టి, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, షకీలా వంటి వాళ్లంతా మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాస్కుల్లో శక్తి వంచన లేకుండా గేమ్ ఆడుతున్నారు. ప్రిన్స్ యావర్ కూడా తెలుగు రాకపోయినా ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తున్నాడు. హౌస్ లో అతను పడుతున్న కష్టం చూసి అందరూ మెచ్చేసుకుంటున్నారు. ప్రశాంత్ తరహాలోనే ప్రిన్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయి రెస్పాన్స్ ఇలాగే కొనసాగితే ఈ సీజన్ ఇంకా సక్సెస్ అవుతుంది అనడంలో ఎలాంటి సదేహం లేదు. మరి.. ఉల్టా పుల్టా సీజన్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మీకెలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి