iDreamPost
android-app
ios-app

వీడియో: అదిరిపోయిన బిగ్ బాస్ లాంఛింగ్ ఈవెంట్ ప్రోమో!

వీడియో: అదిరిపోయిన బిగ్ బాస్ లాంఛింగ్ ఈవెంట్ ప్రోమో!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. మొదటి నుంచి చెప్తున్న విధంగానే సెప్టెంబర్ 3 రాత్రి 7 గంట నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లాంఛింగ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అందులో కింగ్ నాగార్జున్ సూపర్ లుక్స్ లో ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ సీజన్ అనేది ఇప్పటివరకు చూసిన వాటికి ఎంతో భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీజన్ లైన్ కూడా ఉల్టా పుల్టా అని ప్రచారం చేశారు.

కింగ్ నాగార్జున్ అదే గ్రేస్, అదే స్వాగ్ ఈ సీజన్ ని కూడా చేయబోతున్నారు. ఈ ప్రోమో చూస్తే ప్రేక్షకులకు అది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంక ఈ సీజన్ లో పాల్గొనబోయే వాళ్లు అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చాలానే పేర్లు వస్తున్నాయి. వారిలో అసలు ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయం ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత క్లారిటీ వస్తుంది. ఈ సీజన్ ని కొత్తగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కాస్త నేమ్, ఫేమ్ ఉన్న వారినే నిర్వాహకులు సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టాస్కులు, రూల్స్ అన్నీ కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. పాత సీజన్లు చూసి ఆ గేమ్ ప్లాన్, స్ట్రాటజీలను ఇక్కడ అప్లై చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. బిగ్ బాస్ లాంఛింగ్ ప్రోమో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet