iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: నోరేసుకు పడుతున్న రతిక.. ఒక్క ప్రశాంత్ పైనే కాదు..!

  • Published Sep 13, 2023 | 11:28 AM Updated Updated Sep 13, 2023 | 12:03 PM
  • Published Sep 13, 2023 | 11:28 AMUpdated Sep 13, 2023 | 12:03 PM
Bigg Boss 7: నోరేసుకు పడుతున్న రతిక.. ఒక్క ప్రశాంత్ పైనే కాదు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో రెండోవారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ఎందుకంటే ఈ నామినేషన్స్ వల్ల హౌస్ లో ఎవరు రంగులు మారుస్తున్నారు? ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు? ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం అర్థమైపోయింది. మరీ ముఖ్యంగా ఈ రెండు ఎపిసోడ్లు ద్వారా రతికా రోజ్ చాలా పెద్ద నెగిటివిటీని మూట కట్టుకుంది. బిగ్ బాస్ మొదలైన మొదటి వారం మొత్తం ఈమె మాటలు, క్యూట్ స్మైల్ చూసి ప్రేక్షకులు అంతూ ఫిదా అయిపోయారు. కానీ, ఇప్పుడు అదే ప్రేక్షకులు అసలు ఆమె ఏం ఆడుతోంది? మరీ ఇంత చీటింగా? అని క్వశ్చన్ చేస్తున్నారు.

రతికా ఒక హీరోయిన్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ, వచ్చిన రోజు నుంచే పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంది. అతని వెనకే తిరిగింది. అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకు ఈమె ఇలా చేస్తోంది? ఒక కామన్ మ్యాన్ తో హీరోయిన్ మరీ ఇంత క్లోజ్ గా ఉంటుందా? అనే అనుమానాలు వచ్చేలా చేసింది. రెండ్రోజుల తర్వాత వీళ్ల మధ్య ఇంకా ఏదో ఉంది అన్నట్లు బిగ్ బాస్ బీజీఎంలు, సాంగ్స్ వేశాడు. ఇంకేముంది ఒక్కడో తప్పు జరగుతోంది అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ల అనుమానమే నిజమని తేలింది. రతికా రోజ్ కేవలం కంటెంట్ కోసమే ప్రశాంత్ చుట్టూ తిరిగింది. పల్లవి ప్రశాంత్ కూడా ఏదో లవ్ ట్రాక్ ఉంటే వర్కౌట్ అవుతుందని భావించాడు కాబట్టే ఆమె చుట్టూ తిరిగాడు. ఇందులో ఇద్దరి తప్పు ఉంది. అయినా బిగ్ బాస్ హౌస్ లో దీనిని తప్పు అనడానికి కూడా లేదు. నీ స్ట్రాటజీ నీకుంటే.. అతని గేమ్ అతనికుంటుంది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ మొత్తం పల్లవి ప్రశాంత్ చేశాడు అన్నట్లు చిత్రీకరించాలని చూశారు.

మరీ ముఖ్యంగా రతికా రోజ్ నామినేషన్స్ లో ఘోరంగా కామెంట్స్ చేసింది. అక్కడే ఆమె అసలు గేమ్ కూడా అర్థమైంది. హౌస్ లోకి వచ్చిన తర్వాత అసలు పల్లవి ప్రశాంత్ ఎవరో తెలియదు అన్నట్లు పరిచయం చేసుకుని.. ఇప్పుడు మాత్రం నీ ఇంటర్వ్యూ చూశాను, ఒక పిల్లాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చాడు అంటున్నారు. మరి.. ఇంటర్వ్యూ చూసి పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ తెలిసి అతనితో క్లోజ్ గా ఉన్న రతికా రోజ్ గేమ్ కి ఏ పేరు పెట్టాలి? పల్లవి ప్రశాంత్ ఫేక్ గేమ్ ఆడుతున్నాడు? మరి నువ్వు ఎలాంటి గేమ్ ఆడావ్? నామినేషన్స్ తర్వాత కిచెన్ లో ధామినీతో రతికా ఇలా అంటుంది.. “ఇంకా సిగ్గు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పానా? అని అడుగుతున్నాడు. అతను ఏం చేస్తున్నాడో కెమెరాలకు తెలుసు.. ఆడియన్స్ కి తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చింది. మొత్తం అర్థమైంది.. అతను హౌస్ లో ఉండటానికే చేస్తున్నాడు అని. ఆయన కరెక్ట్ ఫోకస్డ్ గానే ఉన్నాడు” అంటూ రతిక కామెంట్స్ చేసింది.

క్లియర్ గా గమనిస్తే.. రతికా చెప్పిన కామెంట్స్ అన్నీ తిరిగి ఆమెకే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. రతికా హౌస్ లో ఉండాలి అనుకునే పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంది. అతను ఏదో కంటెంట్ కోసం చేస్తున్నాడు తెలిసి కూడా ఆమె కూడా ఎంకరేజ్ చేసింది. పల్లవి ప్రశాంత్ కి ఎలా మాట్లాడాలో తెలియదేమో.. నీకు తెలిసి కూడా కావాలనే అలా మాట్లాడావు కదా? అంటే రతికా చెప్పిన ప్రకారం ప్రశాంత్ ది తప్పు అయితే.. అదే తప్పు రతికా కూడా చేసింది. నిజానికి హౌస్ లో ఉన్న వాళ్లంతా అదే తప్పు చేశారు. ఇంక బిగ్ బాస్ గురించి తెలుసుకుని రావడం అంటే అందులో తప్పేముంది? అందరూ చేసిది అదే కదా? ఒక్క ప్రశాంత్ నే కాదు.. గౌతమ్, టేస్టీ తేజ మీద కూడా రతికా ఫైర్ అయింది. గౌతమ్ చెప్పిన రీజన్స్ అసలు కరెక్ట్ కాదంటూ గోల చేసింది.

ఇద్దరి మధ్య గొడవ పెట్టి పైగా తన వల్ల గౌతమ్ కి మంచే జరిగింది అని చెబుతోంది. ఆమె చేసిన పని వల్ల తేజ అందరి ముందు దోషి అయ్యాడు. ప్రిన్స్ యావర్, గౌతమ్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇంత జరిగాక.. కనీసం వచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదు అని గౌతమ్ అంటే.. అది సిల్లీ రీజన్ అంటూ కొట్టిపారేసింది. ఆమె మాత్రం తిన్నాక కూర్చోకుండా పడుకుంటున్నాడు అంటూ తేజాని నామినేట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రతికా రోజ్ గేమ్ గురించి చాలానే ఉన్నాయి. కానీ, ఆమె ఇలాగే కంటిన్యూ చేస్తే.. మరింత నెగిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇకనైనా రతికా గేమ్ మార్చుకుంటుందేమో చూడాలి. మరి.. రతికా రోజ్ గేమ్ ప్లే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio