iDreamPost
android-app
ios-app

నమ్మిన వాళ్లే మోసం చేశారు.. చనిపోదామనుకున్నాను: పల్లవి ప్రశాంత్‌

  • Published Sep 04, 2023 | 9:02 AM Updated Updated Sep 04, 2023 | 9:02 AM
  • Published Sep 04, 2023 | 9:02 AMUpdated Sep 04, 2023 | 9:02 AM
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. చనిపోదామనుకున్నాను: పల్లవి ప్రశాంత్‌

ముందు నుంచి ఊరించినట్లుగానే.. బిగ్‌బాస్‌ సీజన్‌ 7 చాలా డిఫరెంట్‌గా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్‌ గత సీజన్ల మాదిరి ఉండదని.. అంతా ఉల్టా పుల్టా అంటూ హోస్ట్‌ నాగార్జున ముందు నుంచి చెప్తూ వచ్చినట్లే.. సీజన్‌ 7 ప్రారంభం అయ్యింది. సీజన్‌ తొలి రోజే కంటెస్టెంట్లకు టాస్క్‌, పనిష్మెంట్‌, వారిని సేవ్‌ చేసే అస్త్రాలు మాత్రమే కాక.. ఎండింగ్‌లో ఇచ్చే క్యాష్‌ ఆఫర్‌ని కూడా ప్రారంభంలోనే ఇవ్వడంతో ఈ సీజన్‌ మాములుగా ఉండదని.. అటు కంటెస్టెంట్లకు.. ఇటు ప్రేక్షకులకు కూడా బాగానే అర్థం అయ్యింది. ఈసారి అందరి ముసుగులు తొందరగానే తొలగిపోతాయనే క్లారిటీ వచ్చింది.

సీజన్‌ 7లో 14 మంది కంటెస్టెంట్‌లు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి సీజన్‌లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.. ఆశ్చర్యపరిచింది.. రైతుబిడ్డ ఎంట్రీ. అతడే పల్లవి ప్రశాంత్‌. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారికి పల్లవి ప్రశాంత్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనేది అతడి జీవితాశయం. ఇన్నాళ్లకు ప్రశాంత్‌ కల నెరవేరింది. మరి రైతు బిడ్డ ప్రశాంత్‌ గురించి పూర్తి వివరాలు..

వ్యవసాయం అంటే పిచ్చి..

అనాదిగా వ్యవసాయం చేస్తోన్న వారు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో.. భయపడుతున్నారు. ఏరైతు తన బిడ్డలు తన లాగే రైతు కావాలని కోరుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్‌.. మాత్రం వ్యవసాయం మీద అమితమైన ప్రేమ పంచుకున్నాడు. ఎందుకంటే.. ఉద్యోగం చేస్తే.. ఒకరి కింద పని చేయాలి.. అదే వ్యవసాయం అయితే.. తానే పది మంది కడుపు నింపడమే కాక.. ఉపాధి కూడా కల్పించవచ్చు అని భావించాడు. వ్యవసాయం చేయడాన్ని గర్వంగా భావించాడే తప్ప.. అవమానం అనుకోలేదు. ఇక తాను చేసే ప్రతి పనిని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసేవాడు ప్రశాంత్‌. అలా జనాలకు దగ్గరయ్యాడు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలనేది తన కల అని చెప్పేవాడు.

స్నేహితులే మోసం చేశారు.. చనిపోదామనుకున్నాడు

దీని కన్నా ముందు ప్రశాంత్‌ ఫోక్‌ సాంగ్స్‌ చేసేవాడు. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును తీసుకుని.. నమ్మిన స్నేహితులే తనని మోసం చేశారని చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌. అది తట్టుకోలేక.. చనిపోదామనుకున్నాను. నేను చనిపోతానంటే.. మా నాన్న కూడా చనిపోతాను అన్నాడు. ఎవరో మోసం చేస్తే.. నేను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకున్నాను. ఆతర్వాత నేను సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టడం ప్రారంభించాను. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనేది నా కోరిక. అందుకే ప్రతి వీడియోలో నాకు బిగ్‌ బిగ్‌బాస్‌ అవకాశం ఇవ్వమని కోరేవాడిని.. చివరకు నా కల ఫలించింది అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌.

వడ్ల బస్తాతో ఎంట్రీ.. నాగార్జున నుంచి గిఫ్ట్‌..

వడ్ల బస్తాతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్‌. వస్తూ వస్తూ తన ఊరి మట్టిని తీసుకువచ్చి.. నాగార్జునకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. వ్యవసాయం, రైతు గొప్పతనం గురించి ప్రశాంత్‌ చెప్పిన మాటలకు నాగ్‌ కూడా ఫిదా అయ్యాడు. ఇక ప్రశాంత్‌కి నాగార్జున కూడా ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ పచ్చిమిర్చి మొక్కను ప్రశాంత్ చేతికి ఇచ్చి.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మొక్క వాడిపోతే ప్రశాంత్‌కు పనిష్మెంట్ ఇస్తానని.. అలా కాక దానికి మిర్చి పండితే మాత్రం ఓ మంచి బంపరాఫర్ ఇస్తానని చెప్పుకొచ్చారు నాగార్జున. దాంతో కచ్చితంగా ఆ మొక్కను కాపాడుకుంటానంటూ దాన్ని పట్టుకొని హౌస్‌లోకి వెళ్లిపోయాడు ప్రశాంత్. చూడాలి మరి హౌస్‌లో ప్రశాంత్‌ ఎలా ఉంటాడో.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobetHoliganbetJojobet Giriş