iDreamPost

బిగ్ బాస్ లో ఒకే బాత్ రూమ్ లో లేడీ కంటెస్టెంట్స్.. ఆమె లెస్బియన్ అంటూ ఆరోపణలు!

బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ రియాలిటీ షో. అయితే దీనిపై విమర్శలు, హౌస్ లో ఉన్న వాళ్లపై ఆరోపణలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదు.

బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ రియాలిటీ షో. అయితే దీనిపై విమర్శలు, హౌస్ లో ఉన్న వాళ్లపై ఆరోపణలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదు.

బిగ్ బాస్ లో ఒకే బాత్ రూమ్ లో లేడీ కంటెస్టెంట్స్.. ఆమె లెస్బియన్ అంటూ ఆరోపణలు!

బిగ్ బాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో. భారత్ లో ప్రారంభించిన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా ఇప్పుడు నాగార్జున హోస్ట్ గా 7వ సీజన్ నడుస్తోంది. అటు తమిళ్ లో కూడా సీజన్ 7 కొనసాగుతోంది. కోలీవుడ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే తమిళ బిగ్ బాస్ 40 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగుతో పోలిస్తే తమిళ్ లో గొడవలు, కాంట్రవర్సీలు గట్టిగానే జరుగుతున్నాయి. తాజాగా హౌస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ లెస్బియన్ అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. హౌస్ లోనే ఉన్న మరో లేడీ కంటెస్టెంట్ అంటే తనకు ఇష్టం ఏర్పడింది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం నటి మాయ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఉంది. ఆమె తోటి కంటెస్టెంట్ ఐషూతో కలిసి ఒకే బాత్ రూమ్ లోకి వెళ్లింది. అక్కడ వాళ్లు ఏదో విషయాన్ని చర్చించుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు వేరే వాళ్లతో మాట్లాడే సమయంలో తప్పకుండా మైకు ధరించి ఉండాలి. అలా చేయకపోతే అది బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించినట్లు అవుతుంది. వీళ్లకు బాత్ రూమ్ లో మైక్ ధరించాల్సిన అవసరం ఉండదు. దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇద్దరూ ఒకే బాత్ రూమ్ లోకి వెళ్లి ఏదో డిస్కస్ చేసుకున్నారు. అందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ, బాత్ రూమ్ లోకి ఒకసారి ఒక్కళ్లే వెళ్లాలనే రూల్ కూడా ఉంది. దానిని వీళ్లు బ్రేక్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మాయ ఒక లెస్బియన్ అంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సింగర్ సుచిత్ర మాయ ఒక లెస్బియన్ అని ఆరోపణలు చేసింది. ఆమె వల్ల హౌస్ లో ఉన్న ఇతర లేడీ కంటెస్టెంట్స్ కి రక్షణ లేదంటూ తీవ్రంగా ఆరోపించింది.

మరోవైపు తమిళ నటుడు రంగనాథన్ కూడా స్పందించాడు. మాయ మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఎంతో మంది లెస్బియన్స్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో మాయ- పూర్ణిమ బాగా క్లోజ్ అవుతున్నారంటూ రంగనాథన్ చెప్పాడు. మాయకు పూర్ణిమకు ప్రేమ కూడా ఉందేమో అనే అనుమానాన్ని రంగనాథ్ వెల్లిబుచ్చారు. మాయను ట్రాన్స్ జెండర్ కాకపోయినా.. అదే లిస్టులో ఆమెను ఎంపిక చేశారని చెప్పాడు. మాయ ఒక లెస్బియన్ అనే విషయాన్ని ఇద్దరు ముగ్గురు నటీమణులు తనతో చెప్పినట్లు రంగనాథ్ వెల్లడించాడు. హౌస్ లో ఆమె అలవాట్లు కూడా లెస్పియన్ మాదిరిగానే ఉన్నాయన్నాడు. వారికి పురుషులు అంటే అస్సలు పడదంటూ చెప్పాడు. తమిళ ఇండస్ట్రీలో కూడా చాలా మందే ఉన్నారంటూ చెప్పాడు. ఇంక గతంలో కూడా మాయా కృష్ణణ్ పై ఈ ఆరోపణలు ఉన్నాయి.

నటి అనన్య రామ్ ప్రసాద్ మాయపై విమర్శలు చేసింది. తనను లైంగికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందంటూ చెప్పింది. మాయ తనను లైంగిక వేధింపులకు గురి చేయడంతో తాను మానసికంగా కృంగిపోయినట్లు తెలిపింది. ఇలాంటి వేధింపులు ఒక పురుషుడి నుంచి ఉండుంటే ఎంతో ధైర్యంగా చెప్పేదాన్ని అంటూ ఆవేధన వ్యక్తం చేసింది. ఒక స్త్రీ నుంచి ఇలాంటివి ఎదుర్కోవడంతో చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డానంది. 2016లో మాయతో తనకి పరిచయం ఏర్పడిందని.. అప్పుడు తన వయసు 18 సంవత్సరాలు కాగా.. మాయకు 25 ఏళ్లని చెప్పింది. తనను లొంగదీసుకుని తన జీవితాన్ని సర్వ నాశనం చేసిందని ఆరోపించింది. ఆ ఆరోపణలపై అప్పట్లోనే మాయ స్పందించింది. అనన్య కావాలనే అలాంటి ఆరోపణలు చేసిందంటూ వ్యాఖ్యానించింది. విక్రమ్ సినిమాతో మాయా కృష్ణణ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. మరి.. మాయపై వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి