iDreamPost

Pushpa 2: పుష్ప 2 శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఛానల్?

  • Published Feb 01, 2024 | 6:00 PMUpdated Feb 01, 2024 | 6:00 PM

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2. ఇప్పుడు ఈ మూవీ శాటిలైట్ హక్కులకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం పుష్ప 2: ది రూల్ షూటింగ్‌లో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకుడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్ ఈ. చిత్రంలో ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. కాగా పుష్ప 2 శాటిలైట్ హక్కులు ఒక ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లుగా అంతర్గత వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా వద్ద ఉన్నాయని తాజా సమాచారం. అయితే దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే పుష్ప మొదటి భాగం, పుష్ప: ది రైజ్ యొక్క శాటిలైట్ హక్కులు కూడా స్టార్ మా ఛానెల్ ఏ దక్కించుకుంది కాబట్టి సీక్వెల్ కోసం ఆ ఛానెల్ ముందజలో ఉంటుంది.

పుష్ప 2లో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, రావు రమేష్, డాలీ ధనంజయ మరియు అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి