iDreamPost

కానిస్టేబుల్ మృతి కేసులో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి భార్యే హత్య!

కానిస్టేబుల్ మృతి కేసులో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి భార్యే హత్య!

ప్రస్తుతం చాలా బంధాలు నీటి రాతలు మాదిరిగా మారిపోయాయి. ఒకప్పుడు తల్లి, చెల్లి, భర్త, భార్య, బిడ్డ అనే బంధాలకు ఎంతో విలువ ఉండేది. కానీ, ఇప్పుడు చాలా బంధాలు కుటుంబ వ్యవస్థనే అపహాస్యం చేసేలా మారిపోతున్నాయి. భర్తను భార్య హత్య చేయడం.. కట్టుకున్న భార్యను భర్త కాటికి పంపడం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చీకటి సుఖాల కోసం పెళ్లి చేసుకున్న భాగస్వామిని కడతేరుస్తున్నారు. తాజాగా కానిస్టేబుల్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

విశాఖపట్నం వన్ టౌన్ కానిస్టేబుల్ రమేశ్ మృతి కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. రమేశ్ గుండెపోటుతో మరణించినట్లు భార్య శివాని చెప్పుకొచ్చింది. హుటాహుటిన అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు విచారణ జరపగా.. అసలు వెలుగు చూసింది. రమేశ్ ది సహజ మరణం కాదని.. భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసుంటుంది అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. రమేశ్ మద్యంతాగుతుండగా భార్య వీడియో తీసింది. అలా మద్యం సేవించిన తర్వాత గుండెపోటుతో మరణించినట్లు చెప్పింది.

పోలీసులు ఎంటర్ అయిన తర్వతా ఒక క్యాబ్ డ్రైవర్ తో శివానీకి వివాహేతర సంబంధం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడితో కలిసి శివానీనే భర్తను హత్య చేసినట్లు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న రమేశ్ ను దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను గుండెపోటుతో మరణించినట్లు శివానీ చిత్రీకరించింది. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టం అంటూ పోలీసులు చెబుతున్నారు. రమేశ్ ఎంతో యాక్టివ్ గా ఉండేవాడని.. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని సహోద్యోగులు చెబుతున్నారు.

పోలీసులు శివానీ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. అలాగే రమేశ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. శివానీకి ఉన్న పరిచయాలు, ఫ్రెండ్స్ కి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా.. రమేశ్ 2009లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు. 2012లో రమేశ్- శివానీల వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి రమేశ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రమేశ్ మద్యం సేవిస్తున్న సమయంలో భార్య శివానీ వీడియో రికార్డ్ చేసింది. ఆ తర్వాతే అతను గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి