iDreamPost

యూజర్లకు యూట్యూబ్ బిగ్ షాక్.. భారీగా పెంచిన ధరలు

పొద్దున్నే లేచి భక్తి పాటలు విన్నాలన్నా, కూరగాయలు ఉన్నాయి వైరెటీగా కూరలు చేయాలన్నా, ఫలానా ప్రాంతంలో కొత్త షాపింగ్ మాల్ తెరిచారంటా.. అక్కడ జరుగుతున్న హడావుడి, ఏదైనా సరే దొరికే వీడియో సమాచారం.. యూట్యూబ్. ఇప్పుడు ప్రతి ఇళ్లల్లోనూ ఒకప్పటి దూరదర్శన్ మాదిరి అయ్యింది.

పొద్దున్నే లేచి భక్తి పాటలు విన్నాలన్నా, కూరగాయలు ఉన్నాయి వైరెటీగా కూరలు చేయాలన్నా, ఫలానా ప్రాంతంలో కొత్త షాపింగ్ మాల్ తెరిచారంటా.. అక్కడ జరుగుతున్న హడావుడి, ఏదైనా సరే దొరికే వీడియో సమాచారం.. యూట్యూబ్. ఇప్పుడు ప్రతి ఇళ్లల్లోనూ ఒకప్పటి దూరదర్శన్ మాదిరి అయ్యింది.

యూజర్లకు యూట్యూబ్ బిగ్ షాక్.. భారీగా పెంచిన ధరలు

సోషల్ మీడియాకు జనాలు ఎంతలా ప్రభావితం అయ్యారంటే.. అవి లేకుంటే ప్రపంచమే లేదు అనేంతలా. చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు.. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా, థ్రెడ్, ట్విట్టర్(ఎక్స్) వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇంట్లో ఉన్నా, రోడ్డు మీద నడుస్తున్నా, బస్సులో ప్రయాణిస్తున్నా పరిసరాలను, ఇతరులను పట్టించుకోకుండా.. వాటిల్లోనే తలమునకలు అయిపోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌కు. అమ్మాయిల,అబ్బాయిల నుండి అమ్మమ్మల/తాతయ్యల వరకు ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఏ యాప్ తెలిసినా, తెలియకపోయినా.. యూట్యూబ్ మాత్రం అందరికి తెలిసిన, సులువుగా వినియోగించగలిగే ఎంటర్ టైన్ మెంట్ ఛానల్‌గా మారింది.

యూట్యూబ్ చూడని వారు బహుశా ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు యూజర్లకు షాక్ ఇచ్చింది దాని సంస్థ గూగుల్. ఇటీవల ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న పనిలో పడిన యూట్యూబ్.. యూట్యూబ్ ప్రీమియంను తీసుకు వచ్చింది. ఈ యూట్యూబ్ ప్రీమియం ఏంటంటే.. మామూలుగా ఏ మాధ్యమంలో అయినా యూట్యూబ్‌‌లోకి వెళ్లి వీడియో ఓపెన్ చేయగానే..అనేక యాడ్స్ వస్తుంటాయి. ఎన్ని యాడ్స్ వస్తే.. అంత ఆదాయం సంస్థకు. ఇవి ఒక్కొక్కసారి చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ యాడ్స్ వద్దు అనుకున్న వాళ్ల కోసమే తెచ్చినదే యూట్యూబ్ ప్రీమియం. దీనికి నెలకు ఇంతని చార్జీలు వసూలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చార్జీలను ఏడు దేశాల్లో పెంచింది.

అయితే యూజర్లు యూట్యూబ్ యాడ్స్ లేకుండా చూసేందుకు యాడ్ బ్లాకర్లను వాడుతున్నారు. దీంతో సంస్థ ఆదాయానికి గండి పడింది. దీంతో ఆ యాడ్ బ్లాకర్లను వినియోగిస్తున్న యూజర్లను బ్లాక్ చేసేలా కొత్త మెకానిజంను తీసుకు వచ్చింది. యాడ్ బ్లాకర్లను వినియోగిస్తే.. ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది. అది యూట్యూబ్ నిబంధనలకు ఉల్లంఘన కిందకు వస్తుంది. ఒక వేళ ప్రకటను రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాలని సూచిస్తుంది. మొత్తం ఏడు దేశాలకు ఈ మేరకు మెయిల్స్ పంపింది. యూట్యూబ్ ప్రీమియం ధరల్ని పెంచుతున్నట్లు ఆ మెయిల్స్ పంపింది. ఇందులో భారత్ లేకపోవడం గమనార్హం. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చిలీ, జర్మనీ, పోలాండ్, టర్కీ దేశాలకు ధరల్ని పెంచింది. ఈ పెరిగిన ధరలు నవంబర్ 1 నుండి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ప్రీమియం సేవలు తీసుకున్న వారికి పాత చార్జీలు వర్తిస్తాయి. కొత్త వారికి మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి