iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లో డేటింగ్ చేసుకున్న బుల్లితెర జంట బ్రేకప్?

  • Published Apr 16, 2024 | 5:13 PM Updated Updated Apr 16, 2024 | 5:13 PM

బుల్లితెరలో వచ్చే షోస్ ద్వారా ఎంతో మంది జంటలు ఫేమస్ అవుతూ ఉంటారు. ఇక వారి గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక బుల్లి తెర జంట బ్రేక్ అప్ చెప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వారు ఎవరో ఏంటో చూసేద్దాం.

బుల్లితెరలో వచ్చే షోస్ ద్వారా ఎంతో మంది జంటలు ఫేమస్ అవుతూ ఉంటారు. ఇక వారి గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక బుల్లి తెర జంట బ్రేక్ అప్ చెప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వారు ఎవరో ఏంటో చూసేద్దాం.

  • Published Apr 16, 2024 | 5:13 PMUpdated Apr 16, 2024 | 5:13 PM
బిగ్ బాస్ హౌస్ లో డేటింగ్ చేసుకున్న బుల్లితెర జంట బ్రేకప్?

సాధారణంగా బుల్లి తెరలో ప్రసారం అయ్యే టీవీ షోస్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతూ ఉంటారు. ఇక ఆ టీవీ షోస్ లో ఎవరైనా ఇద్దరు క్లోజ్ గా ఉన్నారంటే చాలు వారి గురించి.. మీడియా సోషల్ మీడియాలో గాసిప్స్ మొదలైపోతాయి. ఇలా ఇప్పటివరకు ఎంతో మంది జంటలుగా మారారు. ఇక బిగ్ బాస్ రిలయాలిటీ షో గురించి అందరికి తెలిసిందే. ఈ షో పుణ్యమా అని ప్రేమలో పడిన జంటలు ఉన్నాయి. విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జంట మాత్రం హిందీ బిగ్ బాస్ షో కు సంబంధించిన వారు. బిగ్ బాస్ సీజన్ 17 తో.. సమర్ద్ జురెల్ , ఇషా మాల్వియా ఎంత ఫేమస్ అయ్యారో అందరికి తెలిసిందే. వీరంతా ఆ సీజన్ లో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు ఏమైందో చూసేద్దాం.

బిగ్ బాస్ సీజన్ 17లో సమర్ద్ సమర్ద్ జురెల్ , ఇషా మాల్వియా కలిసి ఒకటే బెడ్ పైన నిద్రించిన వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనితో సోషల్ మీడియా అంతా 19 ఏళ్ళ వయస్సులో ఇలా చేయడం ఏంటి అంటూ.. బిగ్ బాస్ షో ను అడల్ట్ షో గా మార్చేశారంటూ.. నెటిజన్లు వారిని ట్రోల్ చేస్తూ.. వారిపై మండిపడ్డారు. పైగా అదే హౌస్ లో ఇషా మాజీ బాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే సమర్ద్ జురెల్ , ఇషా మాల్వియా జంటపై.. అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్ లో నటించే సమయంలో వీరి మధ్యన రిలేషన్ మొదలైందని.. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత.. ఆ రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ జంట.. తమ బంధానికి బ్రేక్ అప్ చెప్పినట్లు కూడా టాక్ వినిపించింది. కానీ, ఈ రూమర్స్ పైన మాత్రం.. వారిద్దరూ స్పందించలేదు.

అయితే, తాజాగా వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫేలౌ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో వీరు బ్రేక్ అప్ చెప్పుకున్నట్లు అంతా కంఫర్మ్ అయిపోతున్నారు. మరోవైపు తమ అభిమాన జంట విడిపోయినందుకు.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే, ఈ జంట బ్రేక్ అప్ కు మాత్రం కారణం ఏంటి అనేది ఎక్కడ వెల్లడించలేదు. వీరి బ్రేక్ అప్ కు గల కారణం ఏంటి అనేది .. వీరి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా బుల్లితెరపై ఇలాంటి విషయాలు జరగడం ఈ మధ్యన చాలా కామన్ అయిపొయిందని చెప్పి తీరాలి. వారు కలిసి ఉన్నప్పుడు వారి గురించి రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం.. వారి విడిపోయినప్పుడు వారి గురించి న్యూస్ వైరల్ అవ్వడం.. ఇలాంటి రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis