iDreamPost

భూత్ పోలీస్ రిపోర్ట్

భూత్ పోలీస్ రిపోర్ట్

బాలీవుడ్ లో థియేటర్లు తెరుచుకున్నాయి కానీ సరైన సినిమా లేక ఒకరకమైన అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. బెల్ బాటమ్ ఓ మోస్తరు వసూళ్లు తేగా అక్షయ్ కుమార్ స్థాయి కాదని మాత్రం ఖరాఖండిగా చెప్పొచ్చు. ఇక అమితాబ్ బచ్చన్ చెహరే దారుణంగా బోల్తా కొట్టింది. వీటి కన్నా ఎఫ్9, శాంగ్ ఛీ లాంటి హాలీవుడ్ మూవీస్ బ్రహ్మాండంగా ఆడుతుండటం గమనార్హం. వీటి సంగతలా ఉంచితే ఓటిటి రిలీజులు మాత్రం మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న డిస్నీ హాట్ స్టార్ లో `భూత్ పోలీస్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ లాంటి నోటెడ్ క్యాస్టింగ్ ఉండటంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. మరి వాటిని అందుకుందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది కొత్త కథేం కాదు. గతంలో వచ్చిన సూర్య రాక్షసుడు, కార్తీ కాష్మోరాలోని హీరో క్యారెక్టరైజేషన్లను తీసుకుని కొత్తగా అల్లుకుని కామెడీ హారర్ గా మార్చే ప్రయత్నం చేశారు. విభూతి వైద్య(సైఫ్ అలీ ఖాన్), చిరౌంజి వైద్య(అర్జున్ కపూర్)అన్నదమ్ములు. ఇద్దరివీ విభిన్న ఆలోచనలు. తండ్రి ఉల్లత్ బాబా ఇచ్చిన భూత వైద్యం వారసత్వాన్ని తీసుకుని గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో దెయ్యంగా మారిన ఓ టీ ఎస్టేట్ ఓనర్ మాయ(యామీ గౌతమ్)ని పట్టుబట్టే టాస్క్ వీళ్లకు తగులుతుంది. కానీ అనుకున్నంత సులువుగా పని జరగదు. కుటుంబ వృత్తే అయినా భూతాలను నమ్మని వైద్య శరీరంలోకే దెయ్యం వస్తుంది. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు స్టోరీ.

హాట్ స్టార్ కంటెంట్ సెలక్షన్ చూస్తే జాలి కలగక మానదు. గత ఏడాది లక్ష్మితో మొదలుపెట్టి మొన్న ఆగస్ట్ లో భుజ్ ఇప్పుడు ఈ భూత్ పోలీస్ ద్వారా డిజాస్టర్ సినిమాలను ఏరికోరి మరీ కొంటున్నట్టు కనిపిస్తోంది. మెయిన్ పాయింట్ నార్త్ ఆడియన్స్ కు కొత్తే అయినప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు పవన్ కృపాలాని విఫలమయ్యాడు. కొన్ని చోట్ల వర్కౌట్ అయినా అధిక శాతం కామెడీ ప్లస్ ఎమోషన్లు రివర్స్ లో నవ్వులపాలయ్యాయి. ఆర్టిస్టులు ఎంతగా నిలబెట్టాలని ప్రయత్నించినా బ్యాడ్ స్క్రీన్ ప్లే ముందు వాళ్ళ కష్టం తేలిపోయింది. మరీ సిల్లీగా సాగే ఈ ఎంటర్ టైనర్ ని ఎలాంటి అంచనాలు లేకుండా చూసినా యావరేజ్ అనిపించడం కూడా కష్టమే

Also Read : తలైవి రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి