iDreamPost

తల్లికాబోతున్న నితిన్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!

డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లికాబోతోంది. తాజాగా జరిగిన మూవీ కార్యక్రమంలో బేబీ బంప్ తో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ.

డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లికాబోతోంది. తాజాగా జరిగిన మూవీ కార్యక్రమంలో బేబీ బంప్ తో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ.

తల్లికాబోతున్న నితిన్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!

డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లికాబోతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బ్యూటీ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కూడా. యంగ్ హీరో నితిన్ సరసన ఓ సినిమాలో ఆడిపాడింది. తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొంది. ఆ కార్యక్రమంలో బేబీ బంప్ తో కనిపించి అందరికి షాకిచ్చింది. మరి ఇంతకీ తల్లికాబోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

యామీ గౌతమ్.. ఫేయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్ మెంట్ లో కనిపించిన ఈ బ్యూటీ అందరికి సుపరిచితమే. రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన ‘నువ్విలా’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ సొగసరి. ఆ తర్వాత అల్లు శిరీష్ తో గౌరవం మూవీలో నటించింది. వీటితో పాటుగా ‘యుద్ధం’ యంగ్ హీరో నితిన్ నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీలో మెరిసింది. అయితే ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో.. బాలీవుడ్ కు మకాం మార్చింది. ఈ క్రమంలోనే ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో నటిస్తున్న టైమ్ లో ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ప్రేమించింది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత జూన్ 4, 2021న ఈ జంట మూడుముళ్లతో ఒక్కటైయ్యారు. తాజాగా ఈ జోడీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

star heroine becoming mother

ప్రస్తుతం యామీ గౌతమ్ ఆర్టికల్ 370 సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకలో దంపతులిద్దరు కలిసి వచ్చారు. ఈ క్రమంలోనే యామీ బేంబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఇక ఇదే ఈవెంట్ లో ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు ఆదిత్య ధర్. ఈ సంవత్సరం మే నెలలో మేం తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నాం అని పేర్కొన్నాడు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా..  యామీ గౌతమ్ ఆర్టికల్ 370 మూవీలో నటిస్తోంది. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆదిత్య ధర్ నిర్మిస్తున్నాడు.

ఇదికూడా చదవండి:  OTTలోకి యాక్షన్ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి