iDreamPost
android-app
ios-app

ఓటీటీలో రానున్న భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్.. దేనిలో అంటే

  • Published Feb 29, 2024 | 10:04 AM Updated Updated Feb 29, 2024 | 10:05 AM

PV Narasimha Rao Biopic: దేశ మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహా రావు జీవితం ఆధారంగా రూపొందించబడిన బయోపిక్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అలరించనుంది. ఎప్పుడంటే..

PV Narasimha Rao Biopic: దేశ మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహా రావు జీవితం ఆధారంగా రూపొందించబడిన బయోపిక్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అలరించనుంది. ఎప్పుడంటే..

  • Published Feb 29, 2024 | 10:04 AMUpdated Feb 29, 2024 | 10:05 AM
ఓటీటీలో రానున్న భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్.. దేనిలో అంటే

దేశ స్థితిగతులను మార్చి చరిత్రను సృష్టించే సత్తా కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కొద్ది మందిలో దివంగత మాజీ ప్రధాని ‘పీవి నరసింహా రావు’ కూడా ఒకరు. ఈయన భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా.. వారసత్వ రాజకీయాలకు చిరునామా అయిన కాంగ్రెస్ పార్టీలో.. కేవలం తన స్వశక్తితో ఎదిగొచ్చిన నేత పీవీ నరసింహారావు. అంతేకాకుండా.. ఈయన దేశం ఆర్థిక పరంగా ఎదిగేందుకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధాని పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా మరో చరిత్ర సృష్టించారు పీవీ నరసింహారావు.ఈ క్రమంలోనే 1991 నుంచి 1996 మధ్య పీవీ నరసింహారావు భారత ప్రధానిగా పని పని చేశారు. అయితే ఈయన సేవలకు గుర్తింపుగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే.. తెలుగు వారికి గర్వకారణమైన పీవీ నరసింహా రావు జీవితంపై ఓ బయోపిక్ రానుంది.అది ఎప్పుడంటే..

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితం పై తాజాగా బయోఫిక్ అనేది తెరకెక్కించినున్నట్లు ఎప్పటి నుంచే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన బయోపిక్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా నిన్న అనగా ఫిబ్రవరి 28 న ప్రకటించింది.ఇక దీనికి దీనికి ‘హాఫ్ లయన్’ అనే టైటిల్ ను ప్రకటించింది. కాగా, భారత ఆర్థిక విప్లవం వెనుక ఉన్న మహనీయుడు పీవీ నరసింహారావుకు గౌరవంగా ఈ బయోపిక్ తీసుకొస్తున్నట్టు ఆహా ట్వీట్ చేసింది. అలాగే, ఆయన చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా ఎగ్జైటింగ్‌, సంతోషంగా ఉన్నామని ట్వీట్ చేసింది.అయితే పీవీ నరసింహారావు బయోపిక్ ను రచయిత వినయ్ సేనాపతి రచించిన హాఫ్ లయన్ బుక్ ఆధారంగా ఆహా రూపొందించనుంది. ఇక దీనికి దర్శకత్వం ప్రకాశ్ ఝా వహించనున్నారు. కాగా,అప్లాజ్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో కలిసి ఆహా.. ఈ బయోపిక్‍ను సమర్పిస్తోంది.ఇక ఈ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ,ఈ బయోపిక్ స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం ఆహా ఇంక ప్రకటించలేదు. మరి త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై ప్రకటన చేసే ఆవకాశం ఉంది.

Biopic of Bharat Ratna PV Narasimha Rao coming on OTT 1

అయితే, పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. 1962 నుంచి 1973 మధ్య ఆంధ్రప్రదేశ్‍లో వివిధ శాఖల మంత్రిగా కూడా పని చేశారు. 1971 నుంచి ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత.. కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లారు. విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ, హోం శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. ఇక  1991 నుంచి 1996 మధ్య ప్రధాన మంత్రిగా పీవీ నరసింహా రావు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‍తో కలిసి చాలా ఆర్థిక సంస్కరణలను పీవీ నరసింహారావు ప్రవేశపెట్టారు.  ఇక చివరిగా 2004 డిసెంబర్‌లో పీవీ నరసింహా రావు కన్నుమూశారు. ఆయన మరణించిన సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇటీవలే భారతరత్న పురస్కారాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిడం పై తెలుగు ప్రజలు ఎంతగానో గర్విస్తున్నారు. మరి, త్వరలో పీవీ నరసింహారావు బయోపిక్ ఓటీటీలో అలరించనుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.