iDreamPost

Best Budget Car: మారుతీలో ఈ కారు ఎంతో స్పెషల్.. 30 కిలోమీటర్ల మైలేజ్ కూడా..!

బడ్జెట్ లో కారు కొనాలి అనుకునే వారికి మారుతీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ కారు అందుబాటులో ఉంది. ఆ కారు ఫీచర్స్ ఏంటో చూద్దాం.

బడ్జెట్ లో కారు కొనాలి అనుకునే వారికి మారుతీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ కారు అందుబాటులో ఉంది. ఆ కారు ఫీచర్స్ ఏంటో చూద్దాం.

Best Budget Car: మారుతీలో ఈ కారు ఎంతో స్పెషల్.. 30 కిలోమీటర్ల మైలేజ్ కూడా..!

కారు కొనాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఏ మోడల్? ఏం ఫీచర్స్ అని చూసిన తర్వాత.. ధర ఎంత అనే ప్రశ్న కూడా వస్తుంది. 100లో 90 మంది కారుని బడ్జెట్ లోని కొనాలి అనుకుంటారు. అందుకు తగినట్లు పెద్దఎత్తున రీసెర్చ్ కూడా చేస్తారు. అయితే ఎక్కడో ఒక మూల మంచి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న కారు బడ్జెట్ లో దొరికితే బాగుండు కదా అనుకుంటారు. అలాంటి వారికి ఈ కారు బెస్ట ఆప్షన్ అవుతుంది. ఈ హ్యాచ్ బ్యాక్ బడ్జెట్ లో ఉండటమే కాకుండా.. అదిరిపోయే ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. అది కూడా మోస్ట్ ట్రస్టెడ్ మారుతీ కంపెనీ మోడల్ కావడంతో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది.

సాధారణంగానే మారుతీ కంపెనీకి భారత మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే బడ్జెట్ లో బెస్ట్ మోడల్ కార్లను ఈ కంపెనీ అందిస్తుంటుంది. అలాగే కారు కొన్న తర్వాత మెయిన్టినెన్స్, సర్వీస్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అందుకే మిడిల్ క్లాస్ వాళ్లకి మారుతీ అనేది మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీగా మారిపోయింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో బడ్జెట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటలో మారుతీ బలేనోకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ హ్యాచ్ బ్యాక్ కారుకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నిజానికి ఈ కారుకి మరో ఆటోమొబైల్స్ కంపెనీ కూడా ఫ్యాన్ అయిపోయింది. అందుకే అచ్చు గుద్దినట్లు అలాంటి మోడల్ లోనే వాళ్లు కూడా ఒక కారుని తయారు చేశారు. అది మరెవరో కాదు.. టయోటా కంపెనీ. వాళ్లు బలేనోకి ఉన్న క్రేజ్ చూసి.. టయోటా గ్లాంజాని తయారు చేశారు. లుక్స్ పరంగా గ్లాంజా అచ్చం బలేనో తరహాలోనే ఉంటుంది. మరి.. ఇంతటి క్రేజ్ ఉన్న కారు ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Best Budget Car in Murthy!

ఈ మారుతీ బలేనో కారులో మొత్తం సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే 4 వేరియంట్స్ ఉన్నాయి. ఈ కారు బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.61 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. బలేనో హైఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.88 లక్షలుగా ఉంది. వేరియంట్ మారే కొద్దీ ధర పెరగడమే కాకుండా.. ఫీచర్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈ జనవరిలో అయితే బలేనో మీద రూ.42 వేల వరకు బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 1197 సీసీ, 90పీఎస్/ 113 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యూయల్ విషయానికి వస్తే.. పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోలు అయితే లీటరుకు 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అదే మీరు సీఎన్జీ వేరియంట్ తీసుకుంటే మీకు కిలోకి 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని అందిస్తుంది.

ఇంక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్స్ ఉన్నాయి. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ సరౌండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ చూస్తే.. 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది. ఈబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ యాంకరేజెస్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమోరా సిస్టమ్ కూడా ఈ కారులో ఉన్నాయి. ఈ బలేనో మార్కెట్ లో ఉన్న టయోటా గ్రాంజా, సిట్రోఎన్ సీ3, హ్యూండాయ్ ఐ20, టాటా అల్ట్రోజ్ కార్లకు గట్టి పోటీనిస్తుంది. మరి.. ఈ మారుతీ బలేనో కారు ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి