iDreamPost
android-app
ios-app

పోలీస్ vs పోలీస్.. OTTలో ఒక్కో సీన్‌కి గూస్ బంప్స్ రావాల్సిందే!

ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేస్తూనే ఉంటాయి. అలాగే కొన్ని పాత మంచి సినిమాలు కూడా మిస్ అవుతుంటారు.. వాటిల్లో బెస్ట్ మూవీ చూడాలనుకుంటే.. ఈ చిత్రం వాచ్ చేయండి. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేస్తూనే ఉంటాయి. అలాగే కొన్ని పాత మంచి సినిమాలు కూడా మిస్ అవుతుంటారు.. వాటిల్లో బెస్ట్ మూవీ చూడాలనుకుంటే.. ఈ చిత్రం వాచ్ చేయండి. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

పోలీస్ vs పోలీస్.. OTTలో ఒక్కో సీన్‌కి గూస్ బంప్స్ రావాల్సిందే!

సాధారణంగా పోలీస్ అనే మాట వినిపిస్తుంటేనే సామాన్యుడు ఉలిక్కిపడతాడు. కానీ సినిమాలో ఓ హీరో ఖాకీ షర్ట్ వేసుకుని.. విలన్లను ఫటా ఫట్ వాయించేస్తే.. సూపర్ అంటూ విజిల్స్ వేస్తాడు. అదే పోలీస్ విలన్ అయితే.. భయపడిపోతుంటాడు. కానీ ఏకంగా పోలీస్ వ్యవస్థలోని మంచి, చెడులను చెప్పాలంటే.. కాస్త ధైర్యం కావాలి. అందులోనూ పోలీసులు అవుదామని వచ్చే యువత.. పరీక్షలు రాసి.. పాసయ్యాక.. కఠిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి ఎందుకు ఇస్తారు వంటి అంశాలను చాలా మంది ప్రస్తావించరు. కానీ అందులో కూడా రాడ్ రియాలిటీ ఎలా ఉంటుందో చూపించిన సినిమానే తానక్కరన్. దీన్ని తెలుగులో కూడా పోలీసోడుగా తీసుకువచ్చారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇది మీరనుకుంటున్న ఇళయదళపతి, సమంత పోలీసోడు కాదు.

ఇది తమిళ పీరియాడిక్ డ్రామా. జై భీమ్ మూవీలో పోలీస్ పాత్ర పోషించిన తమిళ్ అనే వ్యక్తి దీనికి దర్శకుడు. వాస్తవానికి ఆయన కూడా గతంలో పోలీసుగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు తెలిసిన లోటుపాట్లను సినిమాగా తెరకెక్కించి.. చివరి వరకు ఎంగేజ్ చేయగలిగాడు తమిళ్. ఇది దర్శకుడిగా తనకు మొదటి సినిమా. ఇందులో విక్రమ్ ప్రభు, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటించారు. లాల్, మధుసూదన్, బోస్ వెంకట్, ఎం ఎస్ భాస్కర్ కీలక పాత్రలు పోషించాడు. 2022లో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 8న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజై.. మంచి వ్యూస్ రాబట్టుకుంది.  తెలుగులో కూడా ఉంది. 1997లో పోలీస్ ట్రైనింగ్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘనలు ఆధారంగా తానక్కరన్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

ఇలాంటి సినిమా ట్విస్టులు, టర్నింగ్ ఉండవు.. కానీ సినిమా చివరి వరకు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ నెలకొనేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక కథ విషయానికి వస్తే.. ఆనంద్ అనే వ్యక్తి పోలీస్ అవ్వాలన్నది కళ. దానికి తగ్గట్లు పరీక్ష రాసి పాసవుతాడు. చివరికి 9 నెలల ట్రైనింగ్ నిమిత్తం పోలీస్ రిక్రూట్ స్కూల్ (పీఆర్ఎస్)కు పంపుతాడు. అదే సమయంలో కొంత మంది కూడా శిక్షణకు వచ్చి ఉంటారు. వారంతా 1982లో ఇంటర్వ్యూలు క్లియర్ చేసి.. రాజకీయ కారణా వల్ల.. రాలేకపోతారు. చివరికి ఆనంద్ శిక్షణ సమయంలో వారంతా కూడా వచ్చి చేరతారు. వారిని అన్ ఫిట్ గా భావిస్తారు అధికారులు. వీరందరికీ ట్రైనింగ్ ఇస్తాడు ఈశ్వర మూర్తి (లాల్). మొత్తం ఈ ట్రైనింగ్ చుట్టూనే సినిమా తిరుగుతుంది. ఈ మూవీని ఇప్పటి వరకు చూడలేదనుకుంటే.. ఈ వీకెండ్‌కు మంచి ఛాయిస్.  కేవలం పోలీస్ ట్రైనింగ్ మీద ఇంత సినిమా తీయొచ్చా అనిపించకమానదు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ స్ట్రీమింగ్ అవుతుంది.. ఎలా ఉందో చూసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి.