iDreamPost

క్యారెట్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా? రోజూ తింటే..

క్యారెట్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా? రోజూ తింటే..

మనం అందరం పచ్చి కూరగాయలలో ఎక్కువ ఇష్టంగా తినేది క్యారెట్. క్యారెట్ ని మనం ఉప్మా, సాంబార్, పలావులలో ఎక్కువగా వాడతాము. క్యారెట్ ని ఉపయోగించి కూర, క్యారెట్ రైస్, క్యారెట్ ఫ్రై కూడా చేసుకుంటాము. అలాగే చాలామంది క్యారెట్ ని వంటలలో వాడినపుడు కంటే విడిగా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. దీన్ని పచ్చిగా తిన్నా మన శరీరానికి ఎక్కువ విటమిన్లను అందిస్తుంది.

క్యారెట్ లో విటమిన్ A, B1,B2, B3, B6, C మరియు బీటా కెరోటిన్, కాల్షియమ్, పొటాషియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఉంటాయి. క్యారెట్ రోజూ తినడం వల్ల ఉన్న ఉపయోగాలు..

*క్యారెట్ లో ఉండే విటమిన్ A కంటిచూపుని కాపాడుతుంది.
*ఇందులో ఉండే విటమిన్ B1,B2, B3, B6 మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి.
*క్యారెట్ ని రోజూ తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
*కాలేయంలో కొవ్వు చేరడాన్ని క్యారెట్ నియంత్రిస్తుంది.
*క్యారెట్ ని పచ్చిగా తింటే నోటి అల్సర్లు తగ్గుతాయి.
*క్యారెట్ మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
*క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
*క్యారెట్ జ్యూస్ కు కొద్దిగా నీటిని కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
*మహిళల్లో నెలసరి క్రమం తప్పితే క్యారెట్ జ్యూస్ తాగితే దానిని సరిచేస్తుంది.
*గుండె జబ్బులను తగ్గించడంలో కూడా క్యారెట్ సహాయపడుతుంది.
*మూత్రపిండాలకు సంభందించిన సమస్యలను కూడా క్యారెట్ తగ్గిస్తుంది.
*క్యారెట్ రసాన్ని రోజూ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అందుకే ఇకనుంచి రోజూ ఒక క్యారెట్ తినండి, కుదిరితే క్యారెట్ జ్యూస్ తాగండి. మరింత ఆరోగ్యంగా ఉండండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి