iDreamPost

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితులను పట్టించిన క్యాప్.. ఏం జరిగిందంటే

  • Published Apr 13, 2024 | 3:03 PMUpdated Apr 13, 2024 | 3:03 PM

Rameswaram Cafe Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో క్యాప్ కీలక పాత్ర పోషించింది. ఆ వివరాలు..

Rameswaram Cafe Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో క్యాప్ కీలక పాత్ర పోషించింది. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 3:03 PMUpdated Apr 13, 2024 | 3:03 PM
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితులను పట్టించిన క్యాప్.. ఏం జరిగిందంటే

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో చోటు చేసుకున్న బ్లాస్ట్ ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటన ఒక్కసారిగా గోకుల్ చాట్ బ్లాస్ట్ సంఘటనను గుర్తు చేసింది. ఇందుకు బాధ్యులైన వారిని పట్టుకోవడం కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముమ్మర దర్యాప్తు ప్రారంభించింది. ఇక ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఫ్ బ్లాస్ట్ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను ఎన్ఐఏ తాజాగా అరెస్టు చేసింది. ఈ కేసులో మాస్టర్ బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్, పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.

ఈ ఏడాది మార్చి 1న బ్లాస్ట్ జరిగింది. ఘటన తర్వాత పరారైన నిందితులు.. అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తాజాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులను పట్టుకోవడంలో ఓ క్యాప్ కీలకంగా వ్యవహరించింది.

నిందితులను పట్టించిన క్యాప్..

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితులిద్దరి అరెస్ట్ లో ఓ క్యాప్‌ కీలకంగా మారింది. నిందితులు టోపిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. బ్లాస్ట్ అనంతరం పరారైన నిందితులు.. తరచూ సిమ్ కార్డులు మారుస్తూ.. అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్ఐఏ రాడార్‌ నుంచి మాత్రం వారు తప్పించుకోలేకపోయారు.

ఇక మార్చి 1న బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బ్లాస్ట్ జరిగింది. ఘటనలో 10 మంది గాయపడ్డారు. బ్లాస్ట్ కు పాల్పడ్డ వ్యక్తి..మాస్కు ధరించి కేఫ్ కు వచ్చాడు. తనతో పాటు తీసుకువచ్చిన బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమారాలో రికార్డయ్యాయి.

ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎన్ఐఏ అధికారులు విచారించారు. కేఫ్ కు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. క్యాప్‌ పెట్టుకున్న వ్యక్తి.. నోటికి మాస్కు పెట్టుకుని, నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఆ క్యాప్‌ కొంటున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. దీని ఆధారంగా ఎన్ఐఏ అధికారులు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి