iDreamPost
android-app
ios-app

ప్రియుడి ఫోన్‌లో 13 వేల అసభ్య చిత్రాలు.. యువతి ఏం చేసిందంటే..

అసలే అభివృద్ధి చెందిన టెక్నాలజీని మిస్ యూస్ చేస్కుంటున్న కాలంలో ఉంటున్నాం. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఫోటో మార్పింగ్స్, న్యూడ్ వీడియో కాల్స్ అంటూ ఇలా రకరకాల స్కామ్ ల మధ్యన జీవిస్తున్నాం.

అసలే అభివృద్ధి చెందిన టెక్నాలజీని మిస్ యూస్ చేస్కుంటున్న కాలంలో ఉంటున్నాం. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఫోటో మార్పింగ్స్, న్యూడ్ వీడియో కాల్స్ అంటూ ఇలా రకరకాల స్కామ్ ల మధ్యన జీవిస్తున్నాం.

ప్రియుడి ఫోన్‌లో 13 వేల అసభ్య చిత్రాలు.. యువతి ఏం చేసిందంటే..

ఈ మధ్య కాలంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. యువతీ యువకులు తమకు నచ్చిన వారితో సహజీవనం చేస్తున్నారు. ఆడకావచ్చు.. మగ కావచ్చు.. కొన్ని సార్లు భాగస్వాముల కారణంగా దారుణంగా మోసపోతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ ఆడవాళ్ల విషయంలో శాపంగా మారుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. తన బాయ్‌ ఫ్రెండ్‌ ఫోన్‌ను ఓపెన్‌ చేసి చూసి షాక్‌ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 వేల నగ్న చిత్రాలు అతని ఫోన్‌లో వెలుగు చూశాయి.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకి చెందిన ఓ యువతి నగరంలోని ఓ బీపీఓ కంపెనీలో పని చేస్తోంది. ఈ క్రమంలో తనతో పాటు కలిసి పనిచేస్తున్న ఓ యువకుడితో లివ్ ఇన్ లో ఉంటోంది. అయితే, వారిద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు ఆ యువకుడు తన మొబైల్ లో కొన్ని ఫొటోస్ తీశాడు. వాటిని అతడి ఫోన్లో నుంచి డిలీట్ చేయాలని ఆ యువతి అనుకుంది. ఇక, తన బాయ్ ఫ్రెండ్ నిద్రిస్తుండగా అతని మొబైల్ ఓపెన్ చేసింది. వారిద్దరి పిక్స్ డిలీట్ చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్న ఆమెకు ఊహించని షాక్‌ తగిలింది.

అతని ఫోన్లో ఉన్న ఫొటోలు ఆమెకు భయాన్ని కలిగించాయి. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆ మొబైల్‌లో ఏకంగా 13 వేల నగ్న చిత్రాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆ యువతివి కాగా, మరికొన్ని తన సీనియర్ మహిళా సహ ఉద్యోగులవి. అయితే, ఆ యువకుడు ఇప్పటివరకు ఆ న్యూడ్ ఫొటోస్‌ను వాడుకుని ఎవరినీ బెదిరించలేదని సమాచారం. కానీ, భవిష్యత్తులో ఎటువంటి దారుణానికైనా పాల్పడొచ్చు. కాబట్టి, ఆ యువతి బాధిత మహిళలతో కలిసి విషయాన్ని సంస్థ యజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లింది.

మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు బెంగళూరు సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, అందులో కొన్ని నార్మల్ ఫొటోస్ అని, మరికొన్ని మార్ఫింగ్ చేసిన ఫొటోస్ అని పోలీసులు తెలిపారు. ఇక ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. ఏదేమైనా, మన చుట్టూ జరుగుతూ ఉన్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని.. యువతీ యువకులు అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా మహిళలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్ ఏదైనా హద్దుల్లో ఉండాలని నేటి పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి. లేదంటే లేనిపోని ఇరకాటాల్లో పడడం తప్పదు. మరి, బెంగళూరులో ఆ యువతికి ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetzirvebetMeritbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetzirvebetMadridbetMadridbetcasibomsuperbet girişmeritkinggalabetjojobetholiganbet girişMarsbahis GüncelMarsbahis GirişMarsbahis Güncel GirişJojobet GirişCasibom