iDreamPost

Bengaluru Water: బెంగళూరులో నీళ్లు వృధా చేసిన 22 కుటుంబాల భారీ ఫైన్!

ప్రస్తుతం బెంగళూరులో వాటర్ సమస్య ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎందుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు భారీ జరిమానా పడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం బెంగళూరులో వాటర్ సమస్య ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎందుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు భారీ జరిమానా పడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Bengaluru Water: బెంగళూరులో నీళ్లు వృధా చేసిన 22 కుటుంబాల భారీ ఫైన్!

సాధారణంగా ఎక్కడైనా ఏదైనా  తప్పు చేస్తే.. శిక్షలు, జరిమానాలు ఉంటాయి. అయితే చాలా వరకు అతి పెద్ద నేరాలకు మాత్రమే జైలు శిక్షలు అనేవి ఉంటాయి. అయితే కొన్ని రూల్స్ అతిక్రమించిన సమయంలో జరిమానాలు విధిస్తుంటారు. ప్రస్తుతం ఎండకాలం నడుస్తుంది. ఈ సమయంలో నీటి కొరత బాగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్నిప్రాంతాల్లో నీటిని వృథా చేసిన కూడా కఠిన శిక్షలు ఉంటాయి. అలా నీళ్లను వృథా చేసినందుకు 22 కుటుంబాలకు భారీ షాక్ తగిలింది. ఈఘటన బెంగుళురు నగరంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి కష్టాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి ప్రజలు నీటి కొరతను దారుణంగా ఎదుర్కొంటున్నారు. నీళ్ల ట్యాంకర్ల వాళ్లు ధరలను భారీగా పెంచేశారు. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నీటి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే బెంగుళూరులో ఇటీవల నీళ్లను వృధా చేసిన వారిపై జరిమానా విధిస్తామని అధికారులు సైతం ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు భారీ షాక్ తగిలింది.

బెంగళూరులోని 22 కుటుంబాలపై ఒక్కొక్కరికీ రూ. 5,000 జరిమానా విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరత ఉండగా..  ఇలాంటి సమయంలో కావేరి నీటిని అనవసరంగా వాడుకున్నందుకు వారికి జరిమాన విధించినట్లు తెలుస్తోంది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు 22 కుటుంబాల నుంచి రూ. 1.10 లక్షలను వసూలు చేసింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 వేలు జరిమానా విధించింది. ఆ 22 కుటుంబాలు కార్లను శుభ్రపరచడం, తోటపని వంటి వాటి కోసం, అలానే అనవసరమైన పనుల కోసం త్రాగునీటిని ఉపయోగిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా అధికారులకు ఫిర్యాదులు అందాయి. అలా సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులతో చర్యలు తీసుకున్నట్టు బీడబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు తెలిపారు.

బెంగుళూరు నగర పాలక నీటి సరఫరా బోర్డు అధికారులు  నీటి వృధాపై కఠినమైన చర్యలు తీసుకుంటోన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకుంటుంది. ఇదివరకే తీవ్రమైన నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని హోలీ వేడుకల సందర్భంగా పూల్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలకు కావేరి నీరు, బోరు నీటిని ఉపయోగించడాన్ని బీడబ్ల్యూఎస్ఎస్‌బీ నిషేధించింది. అలాగే, అన్ని ప్రాంతాల్లో నీటి వృద్ధాను నియంత్రించే ఎరేటర్‌లను ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఇప్పటికే బెంగళూరు నగరంలో నీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్ల ట్యాంకర్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే బెంగళూరు నగర పాలక అభివృద్ధి అధికారులు నీటి కొరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి