iDreamPost

వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ నటి

వారి వేధింపుల కారణంగా బీనా మానసికంగా చాలా కృంగిపోయింది. ఒకరకంగా ట్రోమాలోకి వెళ్లిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆమె అనుకుంది.

వారి వేధింపుల కారణంగా బీనా మానసికంగా చాలా కృంగిపోయింది. ఒకరకంగా ట్రోమాలోకి వెళ్లిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆమె అనుకుంది.

వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ నటి

‘‘ బంధువులు కాదు.. రాబందులు’’ అని ఏదో సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. కొన్ని సంఘటనలను చూస్తే ఈ డైలాగ్‌ అచ్చు గుద్దినట్లు వారికి సరిపోతుందని చెప్పొచ్చు. ఓ విషయంలో పర్లేదు అనిపించి.. 99 విషయాల్లో మనకు శత్రువులుగా మారుతూ ఉంటారు. బంధువుల్లో మనం పైకి ఎదిగితే సంతోషించే వాళ్లు ఒకరో ఇద్దరో ఉంటే.. ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. తాజాగా, ఓ ప్రముఖ నటి జీవితంలో కూడా బంధువులు రాబందుల్లా తయారయ్యారు.

ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. నిలువ నీడలేకుండా చేశారు. దీంతో ఆ నటి అల్లాడిపోయింది. దేవుడి దయ వల్ల.. పర్లేదు అన్నట్లుగా ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోంది. ఇంతకీ ఎవరా నటి? ఏమా కథ అంటే.. మలయాళంలో బీనా కుంబలంగి అనే ప్రముఖ నటి ఉంది. ఆమె మోహన్‌లాల్‌ కంటే ముందుగా సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించారు.  అయితే, గత కొంత కాలంనుంచి ఆమె జీవితం తల్లకిందులవుతూ వస్తోంది.

భర్త చనిపోయాడు. అక్క ఆస్తి ఇవ్వకుండా మోసం చేసింది. తాజాగా బంధువులు ఆమెను మలయాళ ఫిల్మ్‌ అసోషియేషన్‌ ‘‘ అమ్మా’’ ఇచ్చిన ఇంటినుంచి కూడా వెళ్లగొట్టారు. దీంతో నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన ఓ సామాజిక వేత్త ఉండటానికి వసతి కల్పించాడు. అంతకు క్రితం  ప్రముఖ నటి, సామాజిక వేత్త సీమా జీ నాయర్‌ కారణంగా ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయారు. సీమా చేసిన సాయం కారణంగానే తాను ఇంకా బతికి ఉన్నానని అంటున్నారు.

బీనా కుంబలంగి మాట్లాడుతూ.. ‘‘ మా నాన్న కొబ్బెర బిజినెస్‌ చేసేవారు. మా అమ్మానాన్నలకు మేము ఏడుగురం పిల్లలం. ఒకప్పుడు బాగానే బతికాం. తర్వాత ఆస్తులు పోయాయి. తర్వాత మా నాన్న ఓ ఉద్యోగంలో చేరారు. కొంతకాలానికి ఉద్యోగం కూడా పోయింది. మొత్తం పది మంది ఉంటున్న కుటుంబం. తినడానికి కూడా తిండిలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ఆ వయసులోనే సినిమాల్లో నటించటం మొదలుపెట్టాను.

నేను చిత్రాల్లో నటించిన డబ్బులతోనే మా ఇళ్లు గడిచేది. కొద్దిరోజుల క్రితం నేను సినిమాల్లో సంపాదించిన దాన్ని నాకు ఇవ్వాలని మా అక్కను అడిగాను. అప్పుడు అసలు సమస్య మొదలైంది. మా అక్క, బావ ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. వాళ్లు నాకంత ద్రోహం ఎలాచేస్తారు? మా అమ్మా నాన్న చనిపోయారు? నా భర్త కూడా చనిపోయాడు. నేను ఒంటరిదాన్ని. నాకు పిల్లలు కూడా లేరు. నా మీద కనీసం జాలి అయినా చూపాల్సింది. నేను కష్టపరిస్థితుల్లో ఉన్నపుడు సీమా నన్ను కాపాడింది’’ అని అన్నారు. మరి, బీనా ధీన గాథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి