iDreamPost

చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న జై షా..

  • Author Soma Sekhar Published - 09:54 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 09:54 PM, Fri - 28 July 23
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న జై షా..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన క్రీడాకారులపై కొరడా ఝళిపిస్తుంది ఐసీసీ. వారి ప్రవర్తన ప్రకారం మ్యాచ్ లో ఫీజు కోత, మ్యాచ్ లు ఆడకుండా నిషేధం లాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది. తాజాగా అలాంటి క్రమశిక్షణా చర్యలకు గురైంది టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ సందర్భంగా అపకీర్తిని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి మ్యాచ్ లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. బ్యాట్ తో వికెట్లను కొట్టింది. దీంతో పాటుగా సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫిని పంచుకుంటున్నప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించి ఐసీసీ శిక్షకు గురైంది.

టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి మ్యాచ్ లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ.. పెవిలియన్ కు వెళ్లే క్రమంలో వికెట్లను బ్యాట్ తో కొట్టింది. దీంతో పాటుగా ట్రోఫీని పంచుకుంటున్న క్రమంలోనే బంగ్లా కెప్టెన్ తో దురుసుగా ప్రవర్తించింది. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన హర్మన్ ప్రీత్ కౌర్ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించింది. దాంతో ఈ నిషేధంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. “హర్మన్ ప్రీత్ కౌర్ అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ ఆమెతో మాట్లాడతారు. అయితే ఆమెపై నిషేధం గురించి మేం ఐసీసీని సవాలు చేయబోం” అంటూ చెప్పుకొచ్చాడు జై షా. కాగా.. హర్మన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో డివైడ్ టాక్ నడుస్తోంది. కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. తాజాగా ఆమె ప్రవర్తన ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇదికూడా చదవండి: టీమిండియాకు ఆడనని చెప్పా.. ఆ కండీషన్ తోనే జట్టులోకి వచ్చా: హార్దిక్ పాండ్యా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి