అందుకే ఇండియా-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అదీకాక ఆసియా కప్ పాక్ లో జరిగితే ఇండియా రాదు అని ఖరాకండిగా చెప్పింది బీసీసీఐ. దీంతో ఆసియా కప్ లో టీమిండియా ఆడే మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
అందుకే ఇండియా-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అదీకాక ఆసియా కప్ పాక్ లో జరిగితే ఇండియా రాదు అని ఖరాకండిగా చెప్పింది బీసీసీఐ. దీంతో ఆసియా కప్ లో టీమిండియా ఆడే మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇండియా-పాకిస్థాన్.. ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాయాది దేశంలో ఇండియకు ఎప్పుడూ తలనొప్పి ఉంటూనే ఉంటుంది. అందుకే ఇండియా-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అదీకాక ఆసియా కప్ పాక్ లో జరిగితే ఇండియా రాదు అని ఖరాకండిగా చెప్పింది బీసీసీఐ. దీంతో ఆసియా కప్ లో టీమిండియా ఆడే మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆహ్వానం మేరకు ఆసియా కప్ మ్యాచ్ లు చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాక్ లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఆతిథ్యంపై ప్రశంసలు కురిపించాడు బీసీసీఐ అధ్యక్షుడు.
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పై ప్రశంసలు కురిపించాడు. పీసీబీ ఆహ్వానం మేరకు ఆసియా కప్ మ్యాచ్ లు చూడ్డానికి రోజర్ బిన్నీతో పాటుగా.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్థాన్ కు వెళ్లారు. తాజాగా బుధవారం అటారి-వాఘా సరిహద్దు ద్వారా భారత్ కు వీరిద్దరు తిరిగివచ్చారు. అనంతరం అక్కడి ఆతిథ్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రోజర్ బిన్నీ మాట్లాడుతూ..”పాక్ క్రికెట్ బోర్డ్ మమ్మల్ని బాగా చూసుకుంది. వారి ఆప్యాత, స్నేహపూర్వక ఆదరణ తమకు ఆనందాన్ని ఇచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లు చూడ్డం, పలు విషయాలు చర్చించడమే ప్రధాన అజెండాగా పర్యటన సాగింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం పాక్ ఆతిథ్యాన్ని కొనియాడాడు. పాక్ భద్రత శత్రుదుర్బేధ్యంగా ఉందని కితాబిచ్చాడు. మరి పీసీబీ ఆతిథ్యంపై బీసీసీఐ అధికారులు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.