iDreamPost

IPL 2024: రెండు దశల్లో IPL షెడ్యూల్? కారణం ఏంటంటే?

IPL 2024 సీజన్ ను బీసీసీఐ రెండు దశల్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇలా రెండు భాగాలు నిర్వహించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

IPL 2024 సీజన్ ను బీసీసీఐ రెండు దశల్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇలా రెండు భాగాలు నిర్వహించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

IPL 2024: రెండు దశల్లో IPL షెడ్యూల్? కారణం ఏంటంటే?

IPL 2024 సీజన్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 16 ఎడిషన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టోర్నీ.. 17వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను రూపొందించడంపై కసరత్తులు ప్రారంభించింది బీసీసీఐ. అయితే షెడ్యూల్ ను రూపొందించే విషయంలో బీసీసీఐకి మెుదటి నుంచి ఓ సమస్య ఎదురౌతూనే వస్తోంది. దీంతో ఈ సీజన్ ను రెండు దశల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మరి ఇంతకీ ఈ మెగాటోర్నీని రెండు దశల్లో నిర్వహించాలని చూడటానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. ఇక ఈ మెగా క్రికెట్ జాతరకు సంబంధించిన మినీ వేలం కూడా ఇటీవలే ముగిసిన సంగతి మనకు తెలిసిందే. కాగా.. ఈ సీజన్ షెడ్యూల్ ను రూపొందించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. షెడ్యూల్ ను తయ్యారుచేయడంలో బీసీసీఐకి పెద్ద తలనొప్పి ఎదురౌతోంది. ఇంతకీ ఆ తలనొప్పి ఏంటంటే? మార్చి 22 నుంచి మే 3 మధ్యలో ఈ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సరిగ్గా ఇదే టైమ్ లో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో.. షెడ్యూల్ ను ఖరారు చేయలేక సతమతమవుతోంది. లోక్ సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత, ఆ డేట్స్ ను బట్టి షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని అనుకుంటోంది బీసీసీఐ.

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ఐపీఎల్ ను రెండు దశల్లో నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైమ్ లో కొన్ని మ్యాచ్ లను విదేశాల్లోనూ ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ..”లోక్ సభ ఎన్నికల తేదీలు వచ్చే వరకు మేము వేచి చూడాలి అనుకుంటున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమైతే మాత్రం షెడ్యూల్ ను దశల వారీగా ప్రకటిస్తాం. కానీ భారతదేశం దాటి ఐపీఎల్ పోవాలని మేం అనుకోవడం లేదు. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం” అని అధికారి పేర్కొన్నాడు. మరోవైపు ఇదే విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరిపామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపాడు.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ మెుదటి వారంలో లోక్ సభ ఎన్నికలు నిర్వాహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు, ఈ మేరకు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇదే జరిగితే బీసీసీఐకి పెద్ద తలనొప్పి వచ్చిపడ్డట్లే. దీంతో రెండు దశల్లో ఐపీఎల్ నిర్వహించాల్సి వస్తుంది. గతంలోనూ 2009 ఐపీఎల్ సీజన్ ను లోక్ సభ ఎన్నికలు ఉండటంతో.. సౌతాఫ్రికా వేదిగ్గా జరిగింది. 2014లోనూ తొలి భాగం దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి