iDreamPost
android-app
ios-app

BCCI: టీమిండియా హెడ్ కోచ్ కోసం ప్రకటన విడుదల.. జీతం, అర్హతలు ఇవే!

టీమిండియా హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. మరి భారత జట్టుకు కోచ్ అయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? అతడి జీతం ఎంత? ఆ వివరాలు చూద్దాం..

టీమిండియా హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. మరి భారత జట్టుకు కోచ్ అయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? అతడి జీతం ఎంత? ఆ వివరాలు చూద్దాం..

BCCI: టీమిండియా హెడ్ కోచ్ కోసం ప్రకటన విడుదల.. జీతం, అర్హతలు ఇవే!

టీ20 వరల్డ్ కప్ 2024  తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ తర్వాత తప్పుకోనున్నాడు. అయితే మళ్లీ కోచ్ గా ద్రవిడే వస్తాడా? లేక కొత్త కోచ్ ను తీసుకుంటారా? అతడు భారతీయుడా? లేక విదేశీయుడా? అన్న సందేహాలు టీమిండియా ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. మరి భారత జట్టుకు కోచ్ అయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? అతడి జీతం ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్ పదవీకాలం కూడా ముగుస్తుంది. దాంతో భారత జట్టుకు కొత్త కోచ్ ను నియమించే పనిలో పడింది బీసీసీఐ. అందులో భాగంగా తాజాగా హెడ్ కోచ్ కోసం ప్రకటన విడుదల చేసింది. దీంతో కోచ్ పదవికి ఎలాంటి అర్హతలు ఉంటాయి? అతడికి జీతం ఎంతొస్తుంది? అన్న విషయాలు తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా హెడ్ కోచ్ పదవికి అప్లై చేసుకునే వారికి 60 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. అలాగే కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న టీమ్స్ కు రెండేళ్ల పాటు హెడ్ కోచ్ గా పనిచేసి ఉండాలి. ఐపీఎల్ టీమ్, ఫస్ట్ క్లాస్ టీమ్, ఇంటర్నేషనల్ టీమ్, ఏదైనా జాతీయ జట్లకు కనీసం 3 ఏళ్ల పాటు హెడ్ కోచ్ గా పనిచేసిన  అనుభవం ఉండాలి అని అర్హతలు చెప్పుకొచ్చింది బీసీసీఐ. కాగా.. జీతం విషయానికి వచ్చే సరికి.. అతడి అనుభవం ఆధారంగా జీతం గురించి చర్చిస్తామని బీసీసీఐ అధికారులు తెలిపారు. మూడు ఫార్మాట్లలో టీమిండియా పురుషుల జట్టు బాధ్యత, నిర్వాహణ అంతా హెడ్ కోచ్ దే అని, అతడి  కింద 14 నుంచి 16 మంది స్టాఫ్ మెంబర్స్ ఉంటారని బీసీసీఐ పేర్కొంది. దరఖాస్తులకు మే 27 చివరి తేదీ అని పేర్కొంది. కోత్త కోచ్ పదవి 2024 జులై 1 నుంచి మెుదలై 2027 డిసెంబర్ 31 వరకు అంటే మూడున్నరేళ్ల పాటు కొనసాగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి