iDreamPost
android-app
ios-app

హిట్‌ వికెట్‌, రనౌట్‌.. అయినా కూడా నాటౌట్‌ ఇచ్చిన అంపైర్‌! ఎందుకంటే?

  • Published Jun 21, 2024 | 3:01 PM Updated Updated Jun 21, 2024 | 3:01 PM

Vitality Blast T20, Shan Masood: ఒకవైపు టీ20 వరల్డ్‌ కప్‌ సీరియస్‌గా సాగుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్‌లో నవ్వు తెప్పించే క్రికెట్‌ జరుగుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Vitality Blast T20, Shan Masood: ఒకవైపు టీ20 వరల్డ్‌ కప్‌ సీరియస్‌గా సాగుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్‌లో నవ్వు తెప్పించే క్రికెట్‌ జరుగుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 21, 2024 | 3:01 PMUpdated Jun 21, 2024 | 3:01 PM
హిట్‌ వికెట్‌, రనౌట్‌.. అయినా కూడా నాటౌట్‌ ఇచ్చిన అంపైర్‌! ఎందుకంటే?

క్రికెట్‌లో చాలా రకాల అవుట్లు ఉంటాయి. బౌల్డ్‌, క్యాచ్‌ అవుట్‌, రనౌట్‌, ఎల్బీడబ్ల్యూ, హిట్‌ వికెట్‌, టైమ్డ్‌ అవుట్‌ ఇలా చాలా ఉన్నాయి.. వీటిలో ఏ ఒక్కటి అయినా కూడా బ్యాటర్‌ క్రీజ్‌ వదిలి పెవిలియన్‌కు వెళ్లాలి. అయితే.. తాజాగా ఓ బ్యాటర్‌ ఒకటి కాదు ఏకంగా ఒకసారి రెండు విధాలుగా అవుట్‌ అయ్యాడు. అయినా కూడా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అంపైర్‌ నిర్ణయంతో ఆటగాళ్లకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఆ తర్వాత వీడియా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఒక హిట్‌ హిట్‌ అయి.. మళ్లీ రన్‌ కోసం వెళ్తూ రనౌట్‌ అయినా కూడా అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో.. క్రికెట్‌ అభిమానులు పిచ్చోళ్లు అయిపోతున్నారు. అయితే.. అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇవ్వడమే కరెక్ట్‌ అంటూ రూల్స్‌ చెప్పాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అంపైర్‌ ఎందుకు నాటౌట్‌ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్‌ టీ20 టోర్నీలో యార్క్‌షైర్‌, లాంక్‌షైర్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యార్క్‌షైర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో లాంక్‌షైర్‌ బౌలర్‌ జాక్ బ్లాథర్విక్ వేసిన 15వ ఓవర్‌లో యార్క్‌షైర్‌ బ్యాటర్‌ షాన్ మసూద్ హిట్ వికెట్‌గా అవుట్‌ అయ్యాడు. షాట్‌కు ప్రయత్నించి అదుపుతప్పి కాలితో వికెట్లను తాకాడు. దీంతో బెయిల్స్ కింద పడ్డాయి. దీంతో మసూద్ ఔట్ అని భావించారు. ఇదే సమయంలో అంపైర్ నోబాల్ అని సిగ్నల్ ఇవ్వడంతో గందరగోళానికి గురయ్యాడు. అవతలి ఎండ్‌లో ఉన్న జో రూట్.. స్ట్రైకింగ్ ఎండ్ వైపు రన్‌ కోసం వచ్చాడు. కానీ మసూద్ క్రీజులోకి చేరే సరికే ఫీల్డర్‌ బాల్‌ను బౌలర్‌కు అందివ్వడం అతను వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. దీంతో మసూద్ ఔట్ మళ్లీ అవుట్‌ అయ్యాడని అంతా భావించారు. కానీ, అంపైర్‌ అందరికీ ఊహించని షాక్‌ ఇచ్చాడు.

నో బాల్‌ కారణంగా హిట్‌ కాదులే అనుకుంటే.. రనౌట్‌ అయినా కూడా మసూద్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్‌. ఎందుకు అలా చేశాడంటే.. ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. బ్యాటర్ ఔట్ అయినట్లు భావించి.. పరుగు కోసం ప్రయత్నించలేదని.. అందుకే వికెట్ కోల్పోయాడని అంపైర్ భావిస్తే రనౌట్ అయినా నాటౌట్ ఇవ్వవచ్చు. దాన్ని డెడ్ బాల్ కింద పరిగణిస్తారు. మసూద్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో అంపైర్ సంతృప్తి చెందాడు. దీంతో నాటౌట్‌గా ప్రకటించాడు. బౌలర్ వేసిన బంతి నోబాల్ కావడంతో హిట్ వికెట్ కాకుండా తప్పించుకున్నాడు. దీంతో మసూద్ హిట్ వికెట్, రనౌట్ అయినా.. నాటౌట్‌గా నిలిచాడు. క్రికెట్‌లో ఇలాంటి వింతలు చోటు చేసుకుంటుండటంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.