iDreamPost

సీమా తరహాలో మరో మహిళ.. కూలి పని చేసే వ్యక్తి కోసం బంగ్లాదేశ్ నుండి

తన నలుగురు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌కు వచ్చి.. ప్రియుడ్ని మనువాడి పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. అలాగే ఇన్ స్టాలో పరిచమైన జార్ఖండ్ వ్యక్తి కోసం ఆరేళ్ల కుమార్తెతో ఇండియాకు వచ్చేసింది పోలండ్ మహిళ పోలాక్ బార్చరా. బంగ్లాదేశ్ మహిళ జూలీ కూడా ప్రేమికుడి కోసం యుపికి చేరింది.

తన నలుగురు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌కు వచ్చి.. ప్రియుడ్ని మనువాడి పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. అలాగే ఇన్ స్టాలో పరిచమైన జార్ఖండ్ వ్యక్తి కోసం ఆరేళ్ల కుమార్తెతో ఇండియాకు వచ్చేసింది పోలండ్ మహిళ పోలాక్ బార్చరా. బంగ్లాదేశ్ మహిళ జూలీ కూడా ప్రేమికుడి కోసం యుపికి చేరింది.

సీమా తరహాలో మరో మహిళ.. కూలి పని చేసే వ్యక్తి కోసం బంగ్లాదేశ్ నుండి

సోషల్ మీడియా పుణ్యమాని ప్రేమకు హద్దులు చెరిపేస్తున్నారు. పబ్జీలో పరిచయమైన వ్యక్తి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి ప్రియుడ్ని కలిసింది పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ అనే మహిళ. తన నలుగురు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌కు వచ్చి.. ప్రియుడ్ని మనువాడి పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. అలాగే ఇన్ స్టాలో పరిచమైన జార్ఖండ్ వ్యక్తి కోసం ఆరేళ్ల కుమార్తెతో ఇండియాకు వచ్చేసింది పోలండ్ మహిళ పోలాక్ బార్చరా. బంగ్లాదేశ్ మహిళ జూలీ కూడా ప్రేమికుడి కోసం యుపికి చేరింది. అలాగే తెలుగు పోరడు కోసం శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి అనే యువతి ఆంధ్రకు వచ్చిన సంగతి విదితమే. పాకిస్తాన్ ప్రియుడి కోసం అంజు అనే మహిళ దాయాది దేశం వెళ్లింది. ఇప్పుడు మరో మహిళ ఇదే బాటను అనుసరించింది. సోషల్ మీడియాలో పరిచమైన వ్యక్తి కోసం బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వచ్చేసింది.

ప్రియుడి కోసం బంగ్లాదేశ్ కు చెందిన ఉమా హబీబా అలియాస్ హనీ అనే మహిళ రాజస్థాన్‌లోని ఒక గ్రామానికి వచ్చింది. వివరాల్లోకి వెళితే రావ్లాలోని 13 డోల్-ఎ గ్రామానికి చెందిన రోషన్ అనే వ్యక్తితో హబీబాకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. కాగా, రోషన్‌కు వివాహం అయ్యి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ అతడి కోసం భారత్ వచ్చేసేందుకు సిద్ధమైంది. అతడిని కలిసేందుకు భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. తొలుత కోల్ కత్తా, ఢిల్లీ మీదుగా బికనీర్ చేరుకుంది. తాను వస్తున్నట్లు రోషన్‌కు ముందుగానే తెలియజేసింది. అయితే అదే సమయంలో రోషన్ భార్య ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లగా.. హబీబాను అతడి ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే అతడి చర్యతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు ఆమె రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

కాగా.. హబీబా హిందీ స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ.. ఆమెకు పంజాబీ అర్థం కావడం లేదు. తన కొడుకు కుటుంబ బాధ్యతలను చూసుకోవాల్సిన అవసరం ఉందని, హబీబాను తన దేశానికి పంపించాలని అధికారులకు రోషన్ తల్లి కృష్ణ బాయి విజ్ఞప్తి చేసింది. తాను, తన కొడుకు కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఉపాధి పొందుతున్నట్లు తెలిపింది. అతడు నాల్గవ తరగతితో ఆపేశాడని, గత ఏడాది అతడి తండ్రి చనిపోయినట్లు తెలిపింది. కాగా, హబీబా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు ఆసక్తి కనిపించడం లేదు. ప్రస్తుతం పర్యాటక వీసాపై వచ్చిన ఆమె.. తాను తిరిగి వెళ్లాలని అనుకోవడం లేదని వెల్లడించింది. కాగా, వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి