iDreamPost

BAN vs NZ: వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌కు భారీ షాక్‌! పసికూన చేతిలో చిత్తుగా..

  • Published Dec 02, 2023 | 11:31 AMUpdated Dec 02, 2023 | 3:23 PM

వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఊహించని గట్టి షాక్‌ తగిలింది. క్రికెట్‌ చరిత్రలోనే తొలి ఆ జట్టు ఓ పసికూన చేతిలో ఓటమి పాలైంది. అది కూడా టెస్ట్‌ మ్యాచ్‌లో.. మరి న్యూజిలాండ్‌ లాంటి పటిష్టమైన టీమ్‌ను ఓడించిన ఆ పసికూన ఎవరో? ఎలా ఓడించిందో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఊహించని గట్టి షాక్‌ తగిలింది. క్రికెట్‌ చరిత్రలోనే తొలి ఆ జట్టు ఓ పసికూన చేతిలో ఓటమి పాలైంది. అది కూడా టెస్ట్‌ మ్యాచ్‌లో.. మరి న్యూజిలాండ్‌ లాంటి పటిష్టమైన టీమ్‌ను ఓడించిన ఆ పసికూన ఎవరో? ఎలా ఓడించిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 02, 2023 | 11:31 AMUpdated Dec 02, 2023 | 3:23 PM
BAN vs NZ: వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌కు భారీ షాక్‌! పసికూన చేతిలో చిత్తుగా..

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా జట్లు మంచి ప్రదర్శన కనబర్చాయి. అంతిమంగా ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ గెలిచినా.. టోర్నీ మొత్తం చూసుకుంటే.. ఈ నాలుగు జట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. ఈ నాలుగు టీములే సెమీ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్‌ గురించి మాట్లాడుకుంటూ.. ఏ వరల్డ్‌ కప్‌ అయినా.. సంచలనాలకు తావు ఇవ్వకుండా.. మెరుగైన ప్రదర్శన ఇస్తూ మినిమమ్‌ గ్యారెంటీ సెమీస్‌ టీమ్‌గా ఉన్న న్యూజిలాండ్‌ ఈ టోర్నీలో సైతం.. కాస్త ఇబ్బంది పడి.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడినా.. అంతిమంగా సెమీ ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో టీమిండియా చేతిలో ఓటమి పాలైంది.

ఇక వరల్డ్‌ కప్‌ తర్వాత.. బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. పసికూన బంగ్లాదేశ్‌.. బ్లాక్‌ క్యాప్స్‌కు దిమ్మతిరిగే దెబ్బకొట్టింది. టీ20, వన్డే మ్యాచ్‌లోనో కాదు.. ఏకంగా.. టెస్టు మ్యాచ్‌లో ఓడించి సంచలనం నమోదు చేసింది. సిల్హెట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పటిష్టమైన న్యూజిలాండ్‌పై పసికూన బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా.. తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ జట్టు ఓపెనర్‌ మహమ్మదుల్లా హసన్‌ జాయ్‌ 86 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్‌ జాకీర్‌ హసన్‌ విఫలమైనా.. కెప్టెన్‌ షాంటో 37, మోమినుల్‌ 37 రాణించారు.

మిగతా బ్యాటర్లు సైతం పర్వాలేదనిపించడంతో టఫ్‌ పిచ్‌పై బంగ్లాదేశ్‌ 300 పైచిలుకు మంచి స్కోరే నిలబెట్టింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ 4, జమ్మిసన్‌, అజాజ్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు, కెప్టెన్‌ టిమ్‌ సౌథీ, ఇస్‌ సోధి చెరొక వికెట్‌ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్‌.. కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో చెలరేగడంతో 317 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. డార్లి మిచెల్‌ 41, గ్లెన్‌ ఫిలిప్స్‌ 42, టిమ్‌ సౌథీ 35 పరుగులు చేసి రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 4 వికెట్లు, మోమినుల్‌ 3 వికెట్లుతో సత్తా చాటారు. షోరిఫుల్‌ ఇస్లామ్‌, మోహదీ హసన్‌, నయీమ్‌ హసన్‌ తలో ఒక వికెట్లు తీసుకున్నారు. ఇక 7 పరుగుల లోటుతో రెండు ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే అవుట్‌ అయ్యారు.

కానీ, బంగ్లా కెప్టెన్‌ షాంటో సెంచరీతో చెలరేగాడు. 105 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు పిల్లర్‌లా నిలబడ్డాడు. షాంటోకు మోమినుల్‌ 40, ముష్ఫికర్‌ రహీమ్‌ 67, మెహదీ హసన్‌ 50 మంచి సహకారం అందించడంతో బంగ్లాదేశ్‌ 338 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ సారి అజాజ్‌ పటేల్‌ 4 , ఇస్‌ సోధీ 2 వికెట్లతో రాణించారు. టిమ్‌ సోథీ, ఫిలిప్స్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో… 332 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది న్యూజిలాండ్‌. కానీ, తైజుల్‌ ఇస్లామ్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగడంతో.. బ్లాక్‌ క్యాప్స్‌ కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. డార్లి మిచెల్‌ ఒక్కడే 58 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో.. టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. క్రికెట్‌ చరిత్రలో న్యూజిలాండ్‌పై బంగ్లాకు ఇది తొలి టెస్ట్‌ గెలుపు. మరి ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఓడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి