iDreamPost

రేవంత్‌ రెడ్డికి బండ్ల గణేష్‌ సపోర్ట్‌.. పాత వీడియో షేర్‌ చేస్తూ BRSకు కౌంటర్‌!

  • Published Jul 12, 2023 | 3:09 PMUpdated Jul 12, 2023 | 3:09 PM
  • Published Jul 12, 2023 | 3:09 PMUpdated Jul 12, 2023 | 3:09 PM
రేవంత్‌ రెడ్డికి బండ్ల గణేష్‌ సపోర్ట్‌.. పాత వీడియో షేర్‌ చేస్తూ BRSకు కౌంటర్‌!

రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంతర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వంటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ నేతలైతే రేవంత్‌ రెడ్డిని ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్‌ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ స్పందించాడు. రేవంత్‌ రెడ్డికి మద్దతిస్తూ.. ఆయన వ్యాఖ్యలని బీఆర్‌ఎస్‌ వక్రీకరించిందని తెలిపాడు. ఈ మేరకు గతంలో ఉచిత కరెంట్‌ గురించి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశాడు బండ్ల గణేష్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది.

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు మద్దితిస్తూ బండ్ల గణేష్‌ మంగళవారం సాయంత్రం ట్వీట్‌ చేశాడు. బుధవారం మధ్యాహ్నం మరో ట్వీట్ చేశాడు. ఉచిత కరెంట్‌ పథకాన్ని కాంగ్రెసే తీసుకువచ్చింది. దీని మీద పెటెంట్‌ హక్కులు పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని తెలిపాడు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే అంగీకరించారని తెలుపుతూ.. అందుకు సంబంధించిన పాత వీడియోని ట్వీట్‌ చేశాడు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేస్తుంటే.. అప్పుడు చంద్రబాబు పక్కన కేసీఆర్ ఉన్నారని తెలిపాడు.

కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌ హామీకి కట్టుబడి ఉందని, తాము రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తామని తెలిపాడు. రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాట్లాడారని స్పష్టం చేశాడు. ఇకపై రాజకీయాల గురించి తాను మాట్లాడనని ఇటీవలే చెప్పిన బండ్ల గణేష్‌.. మళ్లీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి మద్దతుగా మాట్లాడటం హాట్‌ టాపిక్‌గా మారింది. తానా మహాసభలకు హాజరైన రేవంత్‌ రెడ్డి.. రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వడం అనవసరం.. కేవలం 3 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తే సరిపోతుందని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి