iDreamPost

YS జగన్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: మాజీ మంత్రి బాలినేని

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో ఒకరు. ఇటీవల కొంతకాలం నుంచి ఆయనపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ.. జిల్లా వైసీపీ కేడర్ లో జోష్ నింపారు.

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో ఒకరు. ఇటీవల కొంతకాలం నుంచి ఆయనపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ.. జిల్లా వైసీపీ కేడర్ లో జోష్ నింపారు.

YS జగన్ ను మళ్లీ  సీఎంగా గెలిపించుకుందాం: మాజీ మంత్రి బాలినేని

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే 90శాతం అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అయ్యింది. ఇలా వైసీపీ అధినేత ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తుండే మరోవైపు ఆ పార్టీ నేతలు కూడా  వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజాల్లోకి వెళ్తున్నారు. అలానే వైసీపీ చేసిన పరిపాలనపై నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీలో కీలకమైన నేతల్లో ఆయన ఒకరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని బలమైన నేత. ఇటీవల కొంతకాలం నుంచి ఆయనపై అనేక అసత్య ప్రచారాలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో పచ్చనేతలు కూడా ఏదో జరుగుతోందని తెగ సంబర పడిపోయారు. అయితే వారందరికి బాలినేని శ్రీనివాస రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. అంతేకాక జిల్లా వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. బుధవారం దర్శి వైఎస్సార్‌సీపీ ఆఫీస్ ను పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ ప్రాంతీయ సమనవ్వయ కర్తగా చెవిరెడ్డి నియమించబడిన తర్వాత తొలిసారి మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.

ఆఫీస్ ప్రారంభానికి ముందు బుధవారం ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో ఆయనతో చెవిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఏదో ఒక మూలన సందేహంగా ఉన్న కేడర్.. ఈ పరిణామంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో  పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇన్ ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ ను ఈ నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో..ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామని  ఆయన పిలుపు నిచ్చారు. మన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దామని తెలిపారు. అలాగే దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిలే కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మరి.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి