iDreamPost

Breaking: జై శ్రీరామ్ నినాదాల మధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట పూర్తి! 500 ఏళ్ళ కల సాకారం!

ఎన్నో శతాబ్దాల కల నేరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పురుడు పోసుకోవడమే కాదూ.. అక్కడ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకుంది.

ఎన్నో శతాబ్దాల కల నేరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పురుడు పోసుకోవడమే కాదూ.. అక్కడ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకుంది.

Breaking: జై శ్రీరామ్ నినాదాల మధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట పూర్తి! 500 ఏళ్ళ కల సాకారం!

అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్మాత్మిక శోభ పరిఢవిల్లుతోంది.జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ ఆ ప్రాంగణమంతా మారుమోగిపోతుంది. 500 ఏళ్ల చరిత్రకు తార్కాణంగా నిలిచిపోయిన అయోధ్య రామాలయంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తి చేసుకుంది. అతిరథ మహారథుల సమక్షంలో.. ప్రతిష్టాత్మకంగా శ్రీరాముని  ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది మంది అక్కడకు చేరుకున్నారు.

ఈ ప్రతిష్టాపనకు ముందు సంగీత విభావరి నిర్వహించారు. ‘రామ రామ జయ రాజారాం’ అంటూ శంకర్ మహాదేవన్ తన పాటలతో భక్తులను పరవశించేలా చేశారు. ఇతర గాయకులు కూడా శ్రీరాముని పాటలతో హిందూ భక్తులను ఓలలాడించారు. అనంతరం ప్రధాని మోడీ సంప్రదాయ దుస్తుల్లో ఆలయం వద్దకు చేరుకున్నారు. శ్రీరాముడికి  పట్టుపీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకుని ఆలయంలోకి ప్రవేశించారు. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు మంగళ వాయిద్యాలు మోగించారు. మేళ తాళాలతో ఆయనకు వేద పండితులు ఆహ్వానం పలికారు. అనంతరం ఆ వస్త్రాభరణాలను పండితులకు అందించారు.  మోడీ గుడిలో ఆసీనులై ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పూజల్లో పాల్గొన్నారు.

రాముని విగ్రహం కళ్లకు కట్టిన పసుపు వస్త్రాన్ని తొలగించగా.. మోడీతో సంకల్ప పూజ చేయించారు పండితులు. కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తుండగా సోమవారం మధ్యాహ్నం 1 2.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో బాల రాముడిని ప్రతిష్టాపన చేశారు.  అనంతరం శ్రీరాముని విగ్రహం వద్ద పూలు ఉంచి.. నమస్కరించారు.  ప్రాణప్రతిష్ట సమయంలో దేవాలయం మీద హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. పూజల అనంతరం విగ్రహానికి హారతులు పట్టారు మోడీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి