iDreamPost

బేబీ మూవీలో పెళ్లికొడుకు.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి బ్రదర్ అని తెలుసా?

  • Author ajaykrishna Updated - 01:12 PM, Fri - 8 September 23
  • Author ajaykrishna Updated - 01:12 PM, Fri - 8 September 23
బేబీ మూవీలో పెళ్లికొడుకు.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి బ్రదర్ అని తెలుసా?

సాధారణంగా సినిమాలలో కొత్త ముఖాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలని ఆరా తీస్తుంటారు జనాలు. కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో చాలాసేపు కనిపిస్తే గానీ గుర్తించుకోలేము. కానీ.. కొన్ని క్యారెక్టర్స్ ఒక సీన్ వరకే కనిపించినా.. ప్రేక్షకుల దృష్టిలో పడిపోతుంటాయి. అలా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ మూవీలో కూడా అలాంటి క్యారెక్టర్ ఒకటి వైరల్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ.. జులై నెలలో థియేట్రికల్ రిలీజై ఎలాంటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. చిన్న సినిమాగా రిలీజై ఏకంగా రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.

డెబ్యూ మూవీతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వైష్ణవి చైతన్య. హీరోయిన్ గా మంచి ఫ్యూచర్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు సైతం మెచ్చుకున్నాయి. అలాగే ఆనంద్ దేవరకొండకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా బేబీ నిలిచింది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ మూవీ.. రీసెంట్ రొమాంటిక్ లవ్ డ్రామాలలో కల్ట్ బొమ్మగా పేర్కొన్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లవ్ చేసిన ఇద్దరు అబ్బాయిలను కాకుండా.. పేరెంట్స్ చూసిన మూడో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. కాసేపు వైష్ణవిని పెళ్లాడిన సీన్ లో మెరిసిన ఆ యాక్టర్ ఎవరు? అని అందరూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

మొత్తానికి అతనెవరో తెలిసిపోయింది. వైష్ణవిని పెళ్లాడిన క్యారెక్టర్.. సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. మీమ్స్ అయితే విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే.. ఆ క్యారెక్టర్ లో మెరిసిన యాక్టర్ ఎవరో కాదు.. అతని పేరు కృష్ణ మల్లిడి. టాలీవుడ్ లో చాలా సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటించిన కృష్ణ.. కలర్ ఫోటోలో హీరోకి సీనియర్ గా కనిపించాడు. అయితే.. ఈ కృష్ణ మల్లిడి.. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వేణు మల్లిడి(వశిష్ఠ)కు సోదరుడు అని సమాచారం. అలాగే యాంకర్ విష్ణుప్రియకు రిలేటివ్ అవుతాడని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బేబీ భర్త ఎవరో తెలిసిపోయింది అంటూ నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి బేబీ పెళ్లికొడుకు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Kri Sh Na (@krishna_mallidi)

 

View this post on Instagram

 

A post shared by Kri Sh Na (@krishna_mallidi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి