iDreamPost
android-app
ios-app

నా కెరీర్​లో కోహ్లీ టెక్నిక్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి: బాబర్ ఆజం

  • Author singhj Published - 04:16 PM, Thu - 31 August 23
  • Author singhj Published - 04:16 PM, Thu - 31 August 23
నా కెరీర్​లో కోహ్లీ టెక్నిక్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి: బాబర్ ఆజం

క్రికెట్​లో ప్రస్తుత తరం ఆటగాళ్లలో అత్యుత్తమం ఎవరంటే.. ఠక్కన వినిపించే పేరు విరాట్ కోహ్లీ. ప్రస్తుత తరం అనే కాదు క్రికెట్ హిస్టరీలో ఆల్​టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లలో కోహ్లీ ఒకడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 22 గజాల పిచ్​పై అతడు సాధించిన పరుగుల ప్రవాహం.. ఏళ్ల తరబడి నిలకడగా రాణించడం, పాత రికార్డులను తుడిపేయడం, అసాధ్యమనుకున్న ఎన్నో కొత్త రికార్డులను సృష్టించిన కోహ్లీని ఈ జనరేషన్​లో బెస్ట్ క్రికెటర్​గా చెప్పుకోవచ్చు. అందుకే కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. క్రికెట్​ అంటే తెలియని ఎంతో మందికి విరాట్ తెలుసంటేనే.. అతడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అభిమానులతో పాటు తన తోటి క్రికెటర్లకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. దాయాది దేశం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా రన్ మెషీన్​ను ఇష్టపడేవారిలో ఒకడు. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా విరాట్​పై ప్రశంసల జల్లులు కురిపిస్తాడు బాబర్. ఆసియా కప్​లో భారత్​తో తలపడేందుకు ముందు కోహ్లీని మరోమారు మెచ్చుకున్నాడతను. టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నాడు బాబర్. విరాట్ కొన్ని సందర్భాల్లో తన గురించి సానుకూలంగా స్పందించాడని.. అది తనలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు. 2019లో తొలిసారి కోహ్లీని కలిశానని.. ఆ సమయంలో అతడి కెరీర్ ఎంత ఉన్నతస్థాయిలో ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందన్నాడు.

విరాట్ కోహ్లీ మాదిరిగా ఇన్నేళ్ల పాటు నిలకడగా ఆడటం అనేది అంత ఈజీ కాదన్నాడు బాబర్ ఆజం. ఇదో అద్భుతమని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్​ మీద తనకు ఉన్న సందేహాలు, టెక్నిక్స్ గురించి అడిగితే కోహ్లీ ఎంతో ఓపికగా బదులిచ్చాడని బాబర్ ఆజం పేర్కొన్నాడు. కోహ్లీ ఇచ్చిన టిప్స్ తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపాడు. కాగా, భారత్​తో మ్యాచ్​కు ముందు పాకిస్థాన్ అదరగొట్టింది. పసికూన నేపాల్​పై ఏకంగా 238 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో సెంచరీతో అదరగొట్టిన బాబర్ ఆజం ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో టీమిండియాను ఎదుర్కొనేందుకు దాయాది జట్టు సమాయత్తమవుతోంది.