iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ బ్రేక్‌ చేసి వరల్డ్‌ నెం.1గా బాబర్‌ అజమ్‌! కానీ, ఏం లాభం?

  • Published May 15, 2024 | 12:29 PM Updated Updated May 15, 2024 | 12:31 PM

Babar Azam, Virat Kohli: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రికార్డును పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ బ్రేక్‌ చేసి.. వరల్డ్‌ నంబర్‌ వన్‌ అయ్యాడు. అయినా కూడా బాబర్‌ వేస్ట్‌ అంటూ విమర్శలు వస్తున్నాయి. అవి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

Babar Azam, Virat Kohli: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రికార్డును పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ బ్రేక్‌ చేసి.. వరల్డ్‌ నంబర్‌ వన్‌ అయ్యాడు. అయినా కూడా బాబర్‌ వేస్ట్‌ అంటూ విమర్శలు వస్తున్నాయి. అవి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 15, 2024 | 12:29 PMUpdated May 15, 2024 | 12:31 PM
విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ బ్రేక్‌ చేసి వరల్డ్‌ నెం.1గా బాబర్‌ అజమ్‌! కానీ, ఏం లాభం?

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా వరల్డ​్‌ నంబర్‌ వన్‌ పొజిషన్‌లోకి వచ్చాడు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేసి.. బాబర్‌ అ‍గ్రస్థానంలోకి వచ్చాడు. మంగళవారం పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా బాబర్‌ అజమ్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌ బాబర్‌ అజమ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రపంచంలోనే బాబర్‌ అజమ్‌ను కొట్టే బ్యాటర్‌ లేడని, స్టార్‌ బ్యాటర్‌గా కీర్తి పొందుతున్న విరాట్‌ కోహ్లీని సైతం బాబర్‌ దాటేశాడంటూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

దీనికి కౌంటర్‌గా కొంతమంది క్రికెటర్‌ అభిమానులు.. బాబర్‌ అజమ్‌ టీ20ల్లో విరాట్‌ కోహ్లీ అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ రికార్డును బ్రేక్‌ చేసి ఉండొచ్చని, కానీ, ఆ రికార్డు ఎంతో కాలం నిలవదని అంటున్నారు. అయినా బాబర్‌ అజమ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసినా కూడా అదో వేస్ట్‌ రికార్డ్‌ అని, అది విరాట్‌ కోహ్లీ కాలి గోటికి కూడా సరిపోదని ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే.. విరాట్‌ కోహ్లీ పెద్ద పెద్ద టీమ్స్‌పై ఎక్కువ హాఫ్‌ సెంచరీలు చేస్తే.. బాబర్‌ అజమ్‌ మాత్రం జింబాబ్వే, ఐర్లాండ్‌పై కూడా హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఇద్దరు ఏ ఏ టీమ్‌పై ఎన్నెన్ని హాఫ్‌ సెంచరీలు చేశారో ఇప్పుడు చూద్దాం..

babar azam break kohli record

ఇలా చిన్న దేశాలపై బాబర్‌ అజమ్‌ ఎక్కువ హాఫ్‌ సెంచరీలు చేశాడు. అవే జట్లతో టీమిండియా కూడా ఆడి ఉంటే.. విరాట్‌ కోహ్లీ ఇప్పటికే 50కి పైగా హాఫ్‌ సెంచరీలు దాటేసేవాడని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఇప్పటి వరకు బాబర్‌ 117 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. 110 ఇన్నింగ్సులు ఆడి 41.19 యావరేజ్‌, 129.97 స్ట్రైక్‌రేట్‌తో 3955 పరుగులు చేశాడు. అందులో 39కి పైగా ఫిఫ్టీ ప్లస్‌(హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు కలిపి) స్కోర్లు ఉన్నాయి. అలాగే విరాట్‌ కోహ్లీ 117 మ్యాచ్‌లు 109 ఇన్నింగ్సుల్లో 51.75 యావరేజ్‌, 138.15 స్ట్రేక్‌రేట్‌తో 4037 పరుగులు చేశాడు. అందుల 38 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు ఉన్నాయి. టీ20ల్లో ఇద్దరి అత్యధిక స్కోర్‌ 122 కావడం విశేషం. ఇలా యావరేజ్‌, స్ట్రేక్‌రేట్‌ విషయంలో కూడా బాబర్‌ కంటే కోహ్లీ చాలా బెటర్‌గా ఉంటాడు. అయినా.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో మళ్లీ కోహ్లీ నంబర్‌ వన్‌ ప్లేస్‌లోకి వచ్చేస్తాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.