iDreamPost

చైనా వ‌స్తువుల‌పై బాబా రామ్‌దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-అమూల్‌కు ట్విట్ట‌ర్ షాక్‌

చైనా వ‌స్తువుల‌పై బాబా రామ్‌దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-అమూల్‌కు ట్విట్ట‌ర్ షాక్‌

ఇటీవ‌లి దేశంలో మ‌రోసారి చైనా వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించాల‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌తంలో కూడా ఇలాంటి చ‌ర్చే జ‌రిగింది. కానీ మ‌ళ్లీ అది సద్దుమ‌ణిగింది. కానీ ఇటీవ‌లి దేశంలో స్వ‌దేశీ వ‌స్తువు వాడాల‌ని చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో చైనా వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ అంశం కూడా స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతుంది. వాస్త‌వానికి విదేశీ వ‌స్తువుల వాడాకాన్ని త‌గ్గించాల‌ని, దేశీయ వ‌స్తువుల‌ను వాడాల‌ని ప్ర‌భుత్వం పిలుపు ఇచ్చింది.

అందుకు ఒక్క చైనానే కాదు…అన్ని దేశాల వ‌స్తువుల వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని సూచించింది. కానీ దేశంలో ఏదో చైనా మీదే నిషేధం విధించిన‌ట్లు..ఆ దేశ‌ వ‌స్తువుల‌ను మాత్ర‌మే వాడాకాన్ని నిషేదించాల‌ని కొంత మంది సోష‌ల్ మీడియాలోనూ, బ‌హిరంగంగానూ చ‌ర్చ‌ను లేవ‌దీస్తున్నారు. అది చైనా అయినా, అమెరికా అయినా, బ్రిట‌న్ అయినా, జ‌పాన్ అయినా, జ‌ర్మ‌నీ అయినా ఇలా ఏదేశ‌మైనా…ఆయా దేశాల వ‌స్తువుల వాడ‌కాన్ని త‌గ్గించాలి.

అందులో భాగంగానే ఓక‌ల్‌..లోకల్ అని ప్ర‌ధాని మోడీ పిలుపు ఇచ్చారు. అయితే అది సాధ్య‌మా..? లేక అసాధ్య‌మా..? అనేది కీల‌క‌మైంది. ఎందుకంటే స్వేచ్ఛా మార్కెట్ వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం అమ‌లులో ఉంది. కనుక మార్కెట్ గ్లోబెల్ పరిస్థితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో విదేశీ వ‌స్తువుల నిషేధం సాధ్యం కాదు. నిషేధానికి అంత‌ర్జాతీయ మార్కెట్ చ‌ట్టాలు, ఒప్పందాలు అనుమ‌తివ్వ‌వు.

అయితే ఈ అంశం ప‌క్క‌న పెడితే..ప్ర‌స్తుతం దేశంలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతున్న చైనా వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ గురించి ఇటీవ‌లి యోగా గురువు రాందేవ్ బాబా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చైనాను భారతదేశంలో అన్ని రంగాల్లోనూ బహిష్కరించాల్సిందేనని అన్నారు.

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా… ఇలా అన్ని రంగాల్లో బహిష్కరిస్తేనే వారు దార్లోకి వస్తారని పేర్కొన్నారు. దేశ సరిహద్దులను పరిరక్షించ గలిగే పూర్తి సత్తా మన సైన్యానికి ఉందని ఆయన ప్రకటించారు. చైనాను ఆయుధాలతో దెబ్బకొట్టే కంటే… వస్తువులను బహిష్కరిస్తేనే దార్లోకి వస్తోందని స్పష్టం చేశారు. మన దేశంతో చైనా 15 నుంచి 20 లక్షల కోట్ల వ్యాపారాన్ని చేస్తోందని వివరించారు.

టాయ్‌లెట్ సీటు నుంచి బొమ్మల వరకూ అన్నీ చైనా ఉత్పత్తులే అని, ఈ పరిస్థితి మారాలన్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించే విషయంలో ప్రజలు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. చైనాకు బుద్ధి చెప్పాలంటే చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న దృఢ సంకల్పాన్ని ప్రజలందరూ తీసుకోవాలని, ఆ దేశాన్ని ద్వేషించడం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్ – చైనా భాయీ భాయీ అంటూ నెహ్రూ కాలం నుంచే భారత్‌ను చైనా దోచుకుంటోందని, చైనాకు బుద్ధి చెప్పాలంటే వస్తు బహిష్కరణే మార్గమని ఆయన స్పష్టం చేశారు. కేవలం చైనా వస్తువులను బహిష్కరించడమే కాదు… స్వదేశీ వస్తుపై ఓ సమగ్ర విధానాన్ని కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని రాందేవ్ బాబా సూచించారు.

చైనా వస్తువులు వాడద్దన్న అమూల్‌కు ట్విట్ట‌ర్ షాక్‌

భారతదేశంలోనే అతిపెద్ద డెయిరీ కంపెనీ అమూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ కంపెనీ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది. చైనా వస్తువులను బాయ్‌కౌట్ చేయడాన్ని సమర్ధిస్తూ పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అమూల్ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా ట్విట్టర్ ఇండియా డీయాక్టివేట్ చేసింది. దీనిపై నెటిజెన్ల నుంచి ఒక్కసారిగా విమర్శలు రావడంతో వెంటనే ఆ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు.

ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి మీడియాకు తెలియజేశారు.

‘అమూల్ టాపికల్: అబౌట్ ది బాయ్‌కాట్ ఆఫ్ చైనీస్ ప్రోడక్ట్స్’ అనే క్యాప్షన్‌తో జూన్ 3న అమూల్ కంపెనీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ తర్వాత అమూల్ అకౌంట్‌ డీయాక్టివేట్ అయింది. కొందరు నెజిటిన్లు ఈ విషయం అమూల్ దృష్టికి తెచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి