iDreamPost

Ayodhya Ram Mandir: అయోధ్యలో కొలువు దీరనున్న రామయ్య.. వీళ్లు లేకపోతే సాధ్యమయ్యేది కాదు!

  • Published Jan 22, 2024 | 9:45 AMUpdated Jan 22, 2024 | 9:45 AM

అయోధ్యలో భవ్య రామ మందిరంలో ఇవాళ బాలరాముడు కొలువు దీరనున్నాడు. అయితే కోట్లాది మంది కన్న రామ మందిరం కల నెరవేరడం వెనుక చాలా మంది కృషి దాగి ఉంది. వాళ్ల పోరాటం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ 13 మంది చేసిన కృషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అయోధ్యలో భవ్య రామ మందిరంలో ఇవాళ బాలరాముడు కొలువు దీరనున్నాడు. అయితే కోట్లాది మంది కన్న రామ మందిరం కల నెరవేరడం వెనుక చాలా మంది కృషి దాగి ఉంది. వాళ్ల పోరాటం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ 13 మంది చేసిన కృషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 22, 2024 | 9:45 AMUpdated Jan 22, 2024 | 9:45 AM
Ayodhya Ram Mandir: అయోధ్యలో కొలువు దీరనున్న రామయ్య.. వీళ్లు లేకపోతే సాధ్యమయ్యేది కాదు!

శ్రీరాముడి భక్తుల వందల ఏళ్ల కల ఇప్పుడు నెరవేరనుంది. అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాలరాముడు ఇవాళ కొలువు దీరనున్నాడు. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా ఆలయ ప్రారంభోత్సవం సోమవారం జరగనుంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తుండగా అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. రామ మందిరం ప్రారంభం కానుండటంతో కోట్లాది మంది భక్తులు సంతోషంలో మునిగిపోయారు. అయితే ఈ కల ఒక్క రోజులో నెరవేరింది కాదు.. రామ జన్మభూమి ఉద్యమం పేరుతో ఎంతో మంది చేసిన కృషి ఫలితమే ఈ దేవాలయం. రామ మందిరం నిర్మాణం సాకారం కావడంలో 13 మంది ముఖ్యులను ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. వీరిలో ఎల్​కే అద్వానీ, వాజ్​పేయి, ఉమా భారతి లాంటి ప్రముఖులతో పాటు ఎవరికీ తెలియని వాళ్లు కూడా ఉన్నారు. మందిరం కోసం ఏదీ లెక్కచేయకుండా ఏళ్ల పాటు పోరాడిన వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లాల్​కృష్ణ అద్వాణీ

రామ జన్మభూమి ఉద్యమం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు.. ఎల్​కే అద్వాణీ. అయోధ్యలో ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా చాలా మంది సాధుసంతులు పోరాడుతూ వచ్చారు. కానీ ఈ అంశాన్ని రాజకీయ, సామాజిక ఉద్యమంగా మలిచి ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసింది మాత్రం అద్వాణీనే. 1990 మార్చిలో గుజరాత్​లోని సోమ్​నాథ్ ఆలయం నుంచి అయోధ్యలోని రామ జన్మభూమి దాకా ఆయన చేసిన యాత్రకు విస్తృత మద్దతు లభించింది.

LK Advani

ప్రమోద్ మహాజన్

రామ జన్మభూమి ఉద్యమంలో భాగంగా అద్వాణీ మొదట సోమ్​నాథ్ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేయాలని భావించారు. అయితే రాముడి రథం వంటి దాంట్లో యాత్ర చేస్తే బాగుంటుందని అప్పటి బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రమోద్ మహాజన్ సూచించారు. ఆయన ఇచ్చిన సలహాతో రథయాత్ర ఐడియా సూపర్బ్​గా వర్కౌట్ అయింది. ప్రజల్లోకి ఈ యాత్ర బాగా వెళ్లింది.

Pramod mahajan

బాలాసాహెబ్ థాక్రే

అయోధ్య ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిలో శివసేన మాజీ చీఫ్, దివంగత బాలాసాహెబ్ థాక్రే ఒకరు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు లక్షలాది మంది శివసైనికులను ఆయన పంపించారు. ప్రాణాలకు తెగించి పోరాడితేనే రామ మందిరం నిర్మాణం అవుతుందంటూ పార్టీ కార్యకర్తలు, నేతల్లో ఆయన స్ఫూర్తి నింపారు.

BTHAkre

కల్యాణ్ సింగ్

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర్​ప్రదేశ్ సీఎంగా కల్యాణ్ సింగ్ ఉన్నారు. 1991 జూన్​లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రామ్​లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన పాలనలోనే అక్కడ రామ మందిరం నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేస్తున్న కరసేవకుల మీద ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

అటల్ బిహరి వాజ్​పేయి

1989 జూన్ 9న హిమాచల్ ప్రదేశ్​లోని పాలంపూర్ రోటరీ భవన్​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. దీనికి బీజేపీ టాప్ లీడర్స్ వాజ్​పేయి, అద్వానీ, శాంతకుమార్, విజయరాజే సింధియా సహా వీహెచ్​పీ అగ్రనేతలు అటెంట్ అయ్యారు. ఇక్కడే అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే విషయం గురించి మాట్లాడారు. గుడి కట్టాలనే ప్రతిపాదనను సీనియర్ నేత అద్వానీ ప్రతిపాదించగా.. దాన్ని అటల్ బిహరీ వాజ్​పేయి ఆమోదించారు. ఇక్కడి నుంచి మందిరం కోసం పోరాటం మొదలైంది.

Atal Vajpai

ఉమా భారతి

పవర్​ఫుల్ లీడర్​గా పేరు తెచ్చుకున్నారు ఉమా భారతి. రామ జన్మభూమి ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.  బోలో జైశ్రీరామ్ నినాదాలతో ఉద్యమాన్ని హోరెత్తించారామె.

అశోక్ సింఘాల్

1984లో విశ్వహిందూ పరిషత్ ఢిల్లీలో ‘ధర్మ సదస్సు’ నిర్వహించింది. రామ జన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఇక్కడే నిర్ణయించింది. అనంతరం ఈ ఉద్యమానికి అశోక్ సింఘాల్​ను ప్రధాన రూపకర్తగా నియమించింది. ఈయన రామ జన్మభూమి తాళాలను తెరవాలని కోరుతూ రామ్​జానకీ రథయాత్రను నిర్వహించారు. ఆయన కృషి వల్లే కరసేవ కూడా మొదలైంది. బాబ్రీ మసీదు తాళాలు తెరుచుకున్న అనంతరం అక్కడ గుడి కట్టాల్సిందేనని ఉద్యమించారు.

మురళీ మనోహర్ జోషి

అద్వానీ చేపట్టిన రథయాత్రలో కీలకంగా వ్యవహరించిన వారిలో మురళీ మనోహర్ జోషి ఒకరు. ఆ యాత్రలో ఈయన సెకండ్ ఇన్ కమాండర్​గా వ్యవహరించారు.

వినయ్ కతియార్

రామ జన్మభూమి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ బజ్​రంగ్ దళ్. దీనికి తొలి అధ్యక్షుడు వినత్ కతియార్. ఫైర్​బ్రాండ్​గా ఈయన పేరు తెచ్చుకున్నాడు. రామ మందిర నిర్మాణంలో కతియార్ పాత్ర ఎంతో ఉంది.

సాధ్వీ రితంబర

రామ జన్మభూమి ఉద్యమం సమయంలో 1991లో దుర్గా వాహిని సంస్థను ఏర్పాటు చేశారు. ఇది విశ్వ హిందూ పరిషత్​లోని మహిళా విభాగం. దీనికి ఛైర్​పర్సన్​గా ఉన్నారు సాధ్వీ రితంబర. ఈ సంస్థ ద్వారా రామ మందిరం కోసం పోరాడుతూ వచ్చారు రితంబర. ఇప్పటికి కూడా ఆమె యాక్టివ్​గా ఉంటూ సంస్థ సేవలను నిర్వహిస్తుండటం గమనార్హం.

ప్రవీణ్ తొగాడియా

అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ప్రవీణ్ తొగాడియా ఒకరు. విశ్వహిందూ పరిషత్​ మాజీ అధ్యక్షుల్లో ఆయన ఒకరు. 1984 నుంచి 2018 వరకు మందిర నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

యోగి ఆదిత్యనాథ్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు అయోధ్య రామ మందిరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ మందిరం కోసం పోరాడిన వారిలో ఆయన కూడా ఒకరు. ముఖ్యంగా ఆలయ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2017 నుంచి ఇప్పటి దాకా ఏకంగా 62 సార్లు అయోధ్యను సందర్శించారు ఆదిత్యనాథ్. మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట ఏర్పాట్లను ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఇవాళ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతోందంటే దానికి యోగి ముందుండి అన్నీ తానై వ్యవహరించడమే కారణం.

Yogi

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ

రామ మందిరం నిర్మాణం పూర్తి చేయాలనేది కోట్లాది మంది భక్తుల కలే కాదు.. బీజేపీ, వీహెచ్​పీ డ్రీమ్ కూడా. అయితే వాజ్​పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అది నెరవేరలేదు. కానీ మోడీ హయాంలో ఇది సాధ్యమైంది. ఆలయం కట్టుకోవచ్చని సుప్రీం నుంచి తీర్పు వెలువడగానే నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ త్వరగా ముగిశాయంటే దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారమే కారణం. యూపీ సీఎం యోగితో నిరంతరం టచ్​లో ఉంటూ ఆలయ నిర్మాణ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు అప్​డేట్స్ తెలుసుకుంటూ వచ్చారు మోడీ. మందిర నిర్మాణానికి సంబంధించి సహాయ సహకారాలు అందించారు.

Modi

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి