iDreamPost

టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్! అతడి కథేంటి?

  • Author Soma Sekhar Published - 06:46 PM, Mon - 20 November 23

అసాధారణ రీతిలో చెలరేగిన ట్రావిస్ హెడ్ అద్భుతమైన శతకంతో కంగారూ టీమ్ కు 6వ ప్రపంచ కప్ ను అందించాడు. మరి టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్ జీవిత చరిత్రేంటో ఓసారి పరిశీలిద్దాం.

అసాధారణ రీతిలో చెలరేగిన ట్రావిస్ హెడ్ అద్భుతమైన శతకంతో కంగారూ టీమ్ కు 6వ ప్రపంచ కప్ ను అందించాడు. మరి టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్ జీవిత చరిత్రేంటో ఓసారి పరిశీలిద్దాం.

  • Author Soma Sekhar Published - 06:46 PM, Mon - 20 November 23
టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్! అతడి కథేంటి?

వరల్డ్ కప్ ఫైనల్.. టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ ముందు 240 పరుగుల ఈజీ టార్గెట్ ను ఉంచింది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుకు ఈ లక్ష్యం ఛేదించడం పెద్ద కష్టమైనపనేమీ కాదని తొలుత అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ ప్రారంభం అయిన 6 ఓవర్లకే టీమిండియా వైపు మ్యాచ్ టర్న్ అయ్యింది. కేవలం 47 రన్స్ కే 3 కీలక వికెట్లను పడగొట్టారు భారత బౌలర్లు. దీంతో మ్యాచ్ థ్రిల్లింగ్ గా మరుతుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ అసాధారణ రీతిలో చెలరేగిన ట్రావిస్ హెడ్ అద్భుతమైన శతకంతో కంగారూ టీమ్ కు 6వ ప్రపంచ కప్ ను అందించాడు. మరి టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్ జీవిత చరిత్రేంటో ఓసారి పరిశీలిద్దాం.

ట్రావిస్ హెడ్.. ప్రస్తుతం ఈ పేరు వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిపోతోంది. అసాధారణ సెంచరీతో ఆస్ట్రేలియాకి ప్రపంచ కప్ ను అందించి.. తన పేరును చిరస్మరణీయంగా క్రికెట్ హిస్టరీలో లిఖించుకున్నాడు. మరి భారత జట్టు ప్రపంచ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్ జీవితాన్ని ఓసారి పరిశీలిద్దాం. హెడ్ 1993 డిసెంబర్ 29న ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో జన్మించాడు. క్రికెట్ పై ఉన్న ఇష్టంతో దాన్నే.. తన కెరీర్ గా ఎంచుకున్నాడు. మెుదట్లో ఆసీస్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో మిడిలార్డర్ బ్యాటర్ గా, ఆఫ్ స్పిన్నర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. అయితే ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత.. హెడ్ ను ఓపెనర్ గా పరీక్షించింది ఆసీస్ మేనేజ్ మెంట్.

ఈ క్రమంలోనే ఆసీస్ జట్టులో కీలక ఆటగాడు అయిన మైక్ హస్సీ స్థానంలో టీమ్ లోకి వచ్చిన హెడ్.. తనదైన ఆటతీరుతో జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. కాగా.. ట్రావిస్ హెడ్ లో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? కీలకమైన మ్యాచ్ లో చెలరేగడం అతడి నైజాం. ఈ సంప్రదాయాన్ని కొన్ని మెగాటోర్నీల్లో మనం చూడొచ్చు. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో 47 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు విజయం చేకూరిందంటే.. అది ట్రావిస్ హెడ్ చలవే. ఓపెనర్ గా బరిలోకి దిగిన అతడు చివరి దాకా క్రీజ్ లో ఉండి 137 పరుగులు చేసి.. విజయానికి 2 రన్స్ కావాలన్నప్పుడు పెవిలియన్ కు చేరాడు. ఈ సెంచరీతో వరల్డ్ కప్ ఫైనల్స్ లో శతకాలు బాదిన ఆసీస్ దిగ్గజాలు అయిన పాంటింగ్, గిల్ క్రిస్ట్ సరసన చేరాడు హెడ్.

ఇక సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో సైతం కష్టాల్లో ఉన్న ఆసీస్ ను 62 పరుగులు చేసి గట్టెక్కించాడు. బౌలింగ్ లో సైతం 2 వికెట్లు తీసి కంగారూ జట్టు ఫైనల్ కు చేరడంలో కీలక పాత్రపోషించాడు. ఈ మ్యాచ్ లే కాక.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా టీమిండియా ఓడిపోవడానికి కారణం ట్రావిస్ హెడే. ఓవల్లో జరిగిన ఈ మ్యాచ్ లో 163 పరుగులు చేసి.. టీమిండియా పాలిట విలన్ గా మారాడు. కీలకమైన మ్యాచ్ ల్లో చెలరేగి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించడంలో సిద్దహస్తుడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో హెడ్ కు బాగాతెలుసు. ఈ మ్యాచ్ లో కూడా తన అపార అనుభవాన్ని ఉపయోగించి.. ఆసీస్ కు 6వ ప్రపంచ కప్ అందించాడు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 42 టెస్టుల్లో 2904, 64 వన్డేల్లో 2393, 20 టీ20ల్లో 460 పరుగులు చేశాడు. మరి టీమిండియా పాలిట విలన్ గా మారి.. అప్పుడు టెస్ట్ ఛాంపియన్ షిప్, ఇప్పుడు వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిస్ హెడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి