Nidhan
క్రికెట్ ఆస్ట్రేలియా మరోమారు ఉలిక్కిపడింది. దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్ తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడంతో షాక్‌కు గురైంది.
క్రికెట్ ఆస్ట్రేలియా మరోమారు ఉలిక్కిపడింది. దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్ తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడంతో షాక్‌కు గురైంది.
Nidhan
క్రికెట్ ఫీల్డ్‌లో గాయాలు అనేవి చాలా కామన్. ముఖ్యంగా బ్యాటర్లకు, ఫీల్డర్లకు ఇవి సర్వసాధారణం. బాల్‌ను పట్టుకోబోయి ఫీల్డర్లు కిందపడి లేదా పరస్పరం ఢీకొని గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంక బ్యాటర్ల సంగతి తెలిసిందే. భీకరమైన పేస్ బౌలర్లు ఎదురైనప్పుడు వాళ్లు ఎంతో టెక్నిక్‌తో ఆడాలి. బాల్ ఏమాత్రం మిస్సయినా గాయాలబారిన పడే ఛాన్స్ ఉంది. ఇలా ఓ రాకాసి బౌన్సర్‌కు ఒక క్రికెటర్ ప్రాణాలు కూడా కోల్పోయాడు. అతడే ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఫిల్ హ్యూస్. వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు హ్యూస్. అయితే ఓ డొమెస్టిక్ మ్యాచ్‌లో ఆడుతూ రాకాసి బౌన్సర్ తలకు తగలడంతో క్రీజులోనే కన్నుమూశాడు. ఇది క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. అలాంటి తరహాలో మరో కంగారూ ఆటగాడు తాజాగా గాయపడ్డాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి ఉలిక్కిపడింది. బాల్ తగిలి 26 ఏళ్ల విల్ పుకోస్కీ అనే యంగ్ క్రికెటర్‌కు ఇంజ్యురీ అయింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి హాని కూడా జరగలేదు. కానీ ఈ ఉదంతం దివంగత ఫిల్ హ్యూస్ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో బాల్ తలకు బలంగా తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు హ్యూస్. ఇప్పుడు అదే తరహాలో అదే టోర్నీలో ఇంచుమించు అలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాక్‌కు గురైంది. పుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైనది కానప్పటికీ అతడు మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రిలే మెరిడిత్ వేసిన బాల్ పుకోస్కీ హెల్మెట్‌కు గట్టిగా తాకింది. దీంతో అతడు క్రీజులో కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు అతడు నొప్పితో విలవిల్లాడాడు.
పుకోస్కీ ఆసీస్ తరఫున ఓ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 72 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక, ఆదివారం నాటి ఘటన విషయానికొస్తే.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియా టైగర్స్-విక్టోరియా టీమ్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్మానియా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టు విసిరిన 442 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విక్టోరియా జట్టు 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పుకోస్కీ అదే టీమ్‌కు ఆడాడు. రాకాసి బౌన్సర్ విసిరిన మెరిడిత్ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించాడు. గాయం తర్వాత క్రీజు విదిలిన పుకోస్కీ మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు.
ఇదీ చదవండి: గుజరాత్ టైటాన్స్ ఆటగాడికి యాక్సిడెంట్.. టీమిండియాలోకి వస్తాడనుకుంటే..!
Will Pucovski retires hurt after getting hit on the head, once again…!!! pic.twitter.com/p2zE8VpWQU
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 3, 2024