iDreamPost

Atithi Devo Bhava : అతిథిదేవోభవ రిపోర్ట్

Atithi Devo Bhava : అతిథిదేవోభవ రిపోర్ట్

ఏళ్ల తరబడి హిట్టు లేకపోయినా బాక్సాఫీస్ మీద దండయాత్రలు చేస్తూనే ఉన్న ఆది సాయికుమార్ తో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు వస్తూనే ఉండటం విశేషం. ఆ క్రమంలో వచ్చిందే అతిథిదేవోభవ. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో టైం ఎక్కువ లేకపోయినా ఆ డేట్ ని తీసుకోవాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు రిలీజ్ ని ప్లాన్ చేసుకున్న ఈ థ్రిల్లర్ మీద ఆదికి మంచి నమ్మకమే ఉంది. ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ప్రత్యేకంగా దీని గురించి చెప్పుకొచ్చాడు. తక్కువ అంచనాలతో ఓపెనింగ్స్ ని డల్ గా మొదలుపెట్టుకున్న ఈ అతిథిదేవో భవ మెప్పించాడో లేదో రిపోర్ట్ లో చూద్దాం

ఒంటరిగా ఉంటే చచ్చిపోవాలనిపించే విచిత్రమైన మోనోఫోబియా అనే వ్యాధితో బాధ పడుతూ ఉంటాడు అభయ్( ఆది సాయికుమార్). ఈ కారణంగానే ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు పరిచయమవుతుంది వైష్ణవి(సువేక్ష). కొత్త ప్రేమకథ మొదలవుతుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో వైష్ణవికి అభయ్ సమస్య గురించి తెలుస్తుంది. అప్పటిదాకా ఇదంతా దాచిపెట్టిన హీరోగారికి ఇంకో కొత్త సమస్య వచ్చి పడుతుంది. మరి ఇతగాడు దాన్ని ఎలా అధిగమించాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు, తన లవ్ ని చివరికి ఎలా గెలిపించుకున్నాడు అనేది ఓపిక చేసుకుని థియేటర్ దాకా వెళ్తే తెలుస్తుంది.

భలే భలే మగాడివోయ్ తో మారుతీ ప్రవేశపెట్టిన ఈ రుగ్మతల ఫార్ములాని మన దర్శకులు ఎప్పుడు వదిలిపెడతారో అర్థం కావడం లేదు. దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ తీసుకున్న పాయింట్ లో కొంత కొత్తదనం ఉందనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కోటింగ్ మరీ బేసిక్ లెవెల్ లో ఉండటంతో అతిథిదేవోభవ కనీస అంచనాలను అందుకోలేకపోయింది. విపరీతమైన సాగతీతకు తోడు పేలని కామెడీ మైనస్ గా నిలిచాయి. అదితో పాటు రోహిణి, సప్తగిరి, అదుర్స్ రఘు లాంటి ఆర్టిస్టులు యథాశక్తి తమ పెర్ఫార్మన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. శేఖర్ చంద్ర సంగీతంలో ఒక పాట మాత్రమే బాగుంది. నేపధ్య సంగీతం పర్వాలేదు. మిగిలిన సాంకేతిక విభాగాలు నిస్సహాయంగా మిగిలిపోయాయి. ఇది ఓటిటిలో చూడటమే కష్టం ఇక థియేటర్ అంటే వేరే చెప్పాలా

Also Read : Thaman S : మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ కి కరోనా పాజిటివ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి