iDreamPost

Ather EVపై రూ.20 వేలు తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కష్టం

Price Cut On Ather EV: అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలని చూస్తున్నారు. కానీ, ధరలు ఎక్కువని వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు ఏథర్ కంపెనీ ఏకంగా రూ.20 వేలు డిస్కౌంట్ ప్రకటించింది.

Price Cut On Ather EV: అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలని చూస్తున్నారు. కానీ, ధరలు ఎక్కువని వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు ఏథర్ కంపెనీ ఏకంగా రూ.20 వేలు డిస్కౌంట్ ప్రకటించింది.

Ather EVపై రూ.20 వేలు తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కష్టం

ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, విద్యుత్ వాహనాలు అనగానే ధర విషయంలోనే ఎక్కువ మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. టూవీలర్ ని అంత ధరపెట్టి కొనాలా? అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. మరీ లక్షన్నర, రూ.1.30 లక్షలు పెట్టి టూవీలర్ కొనాలా? అని ఆగిపోతూ ఉంటారు. కానీ, ఇప్పుడు ఏథర్ ఈవీ అలాంటి వారికి సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ బేస్ మోడల్ పై ఏకంగా రూ.20 వేల వరకు ధల తగ్గింపును ప్రకటించింది. మరి.. ఏ మోడల్ పై ఈ ఆఫర్ ఇచ్చింది? అసలు దాని ధర ఎంత? ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఈవీల్లో బెంగళూరుకు చెందిన ఏథర్ ఈవీలకు ఎంతో మంచి ఆదరణ ఉంది. ఫీచర్స్, లుక్స్, స్పెసిఫికేషన్స్ లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో పోటీ వచ్చే మోడల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఏథర్ కంపెనీ తమ బేస్ మోడల్ అయిన 450sపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈవీ ధరలో రూ.20 వేలు తగ్గిస్తూ ఆఫర్ ప్రకటించింది. ఈ ధర తగ్గింపుతో ఏథర్ 450s మోడల్ ధర ఎక్స్ షో రూమ్ ధర బెంగళూరులో రూ.1.09 లక్షలుగా ఉంది. అలాగే ఢిల్లీలో ఎక్స్ షో రూమ్ ధర రూ.97,500గా ఉంది. మీరు గనుక 450s మోడల్ ని ‘ప్రో ప్యాక్’తో కలిపి తీసుకుంటే మీకు రూ.25 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రో ప్యాక్ లో మీకు మూడేళ్లపాటు పలు రకాల బెనిఫిట్స్ లభిస్తాయి. రోడ్ సైడ్ అసిస్టెన్స్, బ్యాటరీ ప్రొటెక్ట్, ఏథర్ స్టాక్ అప్ డేట్స్, ఏథర్ కనెక్ట్ వంటి లాభాలు వస్తాయి. ఇందుకోసం మీరు వెహికల్ కాస్ట్ కంటే కూడా అదనంగా రూ.10 వేలు చెల్లించాలి. సాధారణ తగ్గింపు కంటే మీకు రూ.5 వేలు ఎక్కువ ధర తగ్గిస్తున్నారు కాబట్టి.. ప్రో ప్యాక్ రూ.5 వేలకే కొనుగోలు చేయచ్చు.

ఏథర్ 450s స్పెసిఫికేషన్స్:

ఈ ఏథర్ 450s పేరుకి బేస్ మోడల్ అయినా కూడా మీకు అదిరిపోయే లుక్స్ తో వస్తుంది. దీనిలో చాలా మంచి కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఈవీ 2.9kwh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఈ 450s మోడల్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల వరకు రేంజ్ ని ఇస్తుంది. ఇందులో 5.4 కిలో వాట్స్ మోటర్ ఉంటుంది. మీరు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవంల 3.9 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఈ ఈవీ గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. మీరు ఈ బండిని ఛార్జ్ చేయడానికి 0 నుంచి 80 శాతం బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కేవలం జనవరి నెల వరకే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని టెక్ నిపులు అంటున్నారు.

ఇటీవలే ఏథర్ కంపెనీ తమ ఫ్లాగ్ షిప్ మోడల్ ఈవీని లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఏథర్ 450 అపెక్స్ అనే మోడల్ ని లాంఛ్ చేసింది. ఈ మోడల్ లుక్స్ పరంగా ఎంతో ఆకట్టుకుంటోంది. మొదటిసారి ట్రాన్స్ పరెంట్ సైడ్ ప్యానల్స్ తో ఈ బండి వస్తోంది. ఈ మోడల్ హైదరాబాద్ లో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,88,842గా ఉంది. ఈ బండి 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.9 సెకన్లు మాత్రమే పడుతుంది. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లుగా ఉంది. ఇది 157 కిలో మీటర్ల రేంజ్ తో వస్తోంది. ఈ బండిని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసేందుకు 5.45 గంటలు మాత్రమే పడుతుంది. 7 టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ తో ఈ బండి వస్తోంది. మరి.. ఏథర్ కంపెనీ ఇస్తున్న ఆఫర్ పైమీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి