iDreamPost
android-app
ios-app

IPL 2024: SRH కప్ కొడుతుందా? SRH ఆటను డిసైడ్ చేసేది కావ్య జాతకమే: వేణు స్వామి జోస్యం

  • Published Apr 19, 2024 | 4:48 PM Updated Updated Apr 19, 2024 | 4:48 PM

ఈ సీజన్ లో సన్ రైజర్స్ కప్ కొడుతుందా? కావ్య మారన్ జాతం ఎలా ఉంది? ఈ విషయాలపై ప్రముఖ సెలబ్రిటీ జోతిష్కుడు వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ఈ సీజన్ లో సన్ రైజర్స్ కప్ కొడుతుందా? కావ్య మారన్ జాతం ఎలా ఉంది? ఈ విషయాలపై ప్రముఖ సెలబ్రిటీ జోతిష్కుడు వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

IPL 2024: SRH కప్ కొడుతుందా? SRH ఆటను డిసైడ్ చేసేది కావ్య జాతకమే: వేణు స్వామి జోస్యం

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తూ.. దూసుకెళ్తోంది. బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న SRH బ్యాటర్లు ఐపీఎల్ రికార్డులనే తిరగరాస్తున్నారు. ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ కప్ కొడుతుందా? కావ్య మారన్ జాతం ఎలా ఉంది? ఈ విషయాలపై ప్రముఖ సెలబ్రిటీ జోతిష్కుడు వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ ఆటతీరుపై ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ జాతక ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చాడు.

వేణు స్వామి.. సెలబ్రిటీలకే జాతకాలు చెబుతూ, వారి ఇళ్ళలో పూజలు చేస్తూ ఓ సెలబ్రిటీగా మారాడు. ఇక ఆయన ఏం చెప్పినా, చేసినా వివాదంగా లేదా వైరల్ గా మారుతుంది. అయితే ఎప్పుడూ సినిమాలు, రాజకీయాలకు చెందిన వ్యక్తులపైనే జాతాకాలు చెప్పే వేణు స్వామి.. తాజాగా ఆ రంగాలను వదిలేసి క్రీడా రంగంపై పడ్డాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు ఈ సీజన్ లో ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో SRH అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. రికార్డు స్కోర్లు నమోదు చేస్తూ.. ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తోంది. టైటిల్ రేసులో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ ఆటను కావ్య మారన్ జాతకంతో లింక్ పెట్టాడు వేణు స్వామి.

Kavya Jataka to decide SRH game Venu Swamys prediction

గత సీజన్ లో కావ్య మారన్ జాతకం బాగాలేదని, అందుకే గత సీజన్ లో అనుకున్న ఫలితాలు రాలేదని వేణు స్వామి తెలిపారు. ఈ ఏడాది ఆమె జాతం చాలా బాగుందని, మంచి యోగం పట్టబోతోందని పేర్కొన్నాడు. కాగా.. కావ్యది మిథున రాశి అని, ఈ రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుందని జోస్యం చెప్పాడు. దీంతో ఆమె యజమానికి గా ఉన్న సన్ రైజర్స్ టీమ్ కు కూడా శుభం కలుగుతుందని చెప్పుకొచ్చాడు. చెన్నై, ముంబై, ఆర్సీబీలను ఓడించడం కావ్య మారన్ జాతక ప్రభావమే అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. అతడు ఫోర్లు, సిక్సులు కొడుతుంటే.. అలా చూస్తు ఉండిపోవాలనిపిస్తుందని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. కావ్య మారన్ జాతకం, వేణు స్వామి జోస్యం బట్టి చూస్తే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కప్పు కొట్టడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet