iDreamPost

వీడియో: నెల తిరగకుండానే మరో ఘటన.. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కొరవడింది. ఇటీవల కాలంలో వీరిపై దాడులు పెరుగుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతూ, ఇష్టమొచ్చినట్లు నడుపుతూ.. రాకపోకలు సాగిస్తున్న వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు.

ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కొరవడింది. ఇటీవల కాలంలో వీరిపై దాడులు పెరుగుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతూ, ఇష్టమొచ్చినట్లు నడుపుతూ.. రాకపోకలు సాగిస్తున్న వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు.

వీడియో: నెల తిరగకుండానే మరో ఘటన.. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

ఇటీవల తరచుగా ఆర్టీసీ డ్రైవర్లపై దాడి జరుగుతున్నాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ లేకుండా పోయింది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దుండగులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టిన సంగతి విదితమే. రోడ్డుపై అడ్డంగా ఉన్న బైక్‌ను తీయాలని డ్రైవర్ హారన్ కొట్టడంతో.. ఆగ్రహించిన వ్యక్తులు.. బస్సును ఫాలో చేసి మరీ.. వాహనాన్ని అడ్డగించి, డ్రైవర్‌ను బయటకు లాగి తన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసిన సంగతి విదితమే. తాజాగా మరో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఈ ఘటన కూడా ఏపీలో చోటుచేసుకోవడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో కొంత మంది యువకులు మూకుమ్మడిగా డ్రైవర్ పై దాడి చేశారు.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి డిపో ఆర్టీసీ బస్సు తమిళనాడు రాష్రటం పల్లిపట్టుకు వెళుతోంది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండల పరిధిలోని పచ్చికా పల్లం నుండి కార్వేటి నగరం వైపు వెళుతుండగా.. మండల పరిధి ధర్మా చెరువు ఎస్సీ కాలనీకి చెందిన మోహన్ అనే వ్యక్తి కారులో అటుగా వస్తున్నాడు. బస్సుకు కారు అడ్డం పెట్టడంతో.. దాన్ని పక్కకు తీయమని కోరాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఈశ్వరయ్య. ఈ విషయంపై బస్సు డ్రైవర్,మోహన్ అనే వ్యక్తి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది తీవ్ర స్థాయికి చేరడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఈశ్వరయ్య.. వాహనం నుండి కిందకు దిగి గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో స్థానికులు నచ్చజెప్పి పంపారు.

అయితే ఆర్టీసీ డ్రైవర్ తనను కొట్టాడని మోహన్..తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. కొందరు యువకులు టీఆరీ పురం జగనన్న కాలనీ సమీపంలో అదే ఆర్టీసీ బస్సును రాగానే అడ్డగించి.. వాహనంలో నుండి డ్రైవర్ ఈశ్వరయ్యను బయటకు లాగి పిడిగుద్దులు గుద్దారు. అతడిని దుర్భాషలాడుతూ.. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై కార్మిక సంఘాలు మండిపడుతన్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. నెల తిరగకుండానే రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఆర్టీసీ డ్రైవర్లపై దాడి ఘటనపై తప్పెవరిది అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి