iDreamPost
android-app
ios-app

వరల్డ్ క్రికెట్ లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్!

  • Author Soma Sekhar Published - 09:02 AM, Wed - 20 September 23
  • Author Soma Sekhar Published - 09:02 AM, Wed - 20 September 23
వరల్డ్ క్రికెట్ లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్!

వరల్డ్ క్రికెట్ లో నమోదు అయ్యే కొన్ని రికార్డులు చూస్తే.. షాక్ కు గురికాక తప్పదు. ఒక్కోసారి భారీ రికార్డులు నమోదు అయితే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త రికార్డులు నెలకొల్పబడుతుంటాయి. తాజాగా అలాంటి రికార్డే ఏసియన్ గేమ్స్ లో నమోదు అయ్యింది. మంగోలియా వర్సెస్ ఇండోనేషియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో వరల్డ్ క్రికెట్ లోనే అత్యంత చెత్త రికార్డు నమోదు అయ్యింది. మంగోలియా మహిళల జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయ్యి.. దారుణమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదీకాక ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టుకు 49 పరుగులను ఎక్స్ ట్రాల రూపంలో సమర్పించుకుంది మంగోలియా వుమెన్స్ టీమ్.

ఏషియన్ గేమ్స్ లో భాగంగా మహిళల విభాగంలో మంగోలియా వర్సెస్ ఇండోనేషియ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో దారుణమైన రికార్డు నమోదు అయ్యింది. ఇండోనేషియా బౌలర్ల ధాటికి మంగోలియా వుమెన్స్ టీమ్ కేవలం 15 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో వరల్డ్ క్రికెట్ లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఈ సంవత్సరమే స్పెయిన్ తో జరిగిన పురుషుల టీ20 మ్యాచ్ లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 రన్స్ కే కుప్పకూలి దారుణమైన రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇదే అత్యల్ప స్కోర్ గా ఉంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జట్టులో ని లుహ్ దేవి(62), ని ఫుటు(35) పరుగులతో రాణించారు. అయితే ఇండోనేషియా తక్కువ పరుగులే చేసేది. కానీ మంగోలియా బౌలర్లు ఏకంగా 49 ఎక్స్ ట్రాలు సమర్పించుకున్నారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా మహిళల జట్టు ఇండోనేషియా బౌలర్ల ధాటికి 10 ఓవర్లలో కేవలం 15 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా బ్యాటర్లలో ఏడుగురు డకౌట్ గా వెనుదిరిగారు. జట్టులో 5 పరుగులు చేసిన బట్జర్గల్ టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఇక ఇండేనేషియా బౌలర్లలో ఆండియానీ(4/8), రెహ్మవతి(2/1), ని లుహ్ దేవి(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు.