ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్ లకు వరుణుడి భయం పట్టుకుంది. ఇప్పటికే గ్రూప్ దశలో పలు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కావడం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆసియా కప్ లో సూపర్ 4 మ్యాచ్ లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 9న కొలంబో వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కానీ ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ని నిర్ణయించలేదు. కాగా.. సెప్టెంబర్ 10 ఆసియా కప్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన ఇండియా-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ కు రిజర్వ్ డేని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి మిగతా జట్ల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా సెప్టెంబర్ 10న ఇండియా-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దానికి కారణం.. ఈరోజు కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గ్రూప్ దశలోనే ఇండియా-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందేమో అని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC).
ఒకవేళ వర్షం కారణంగా ఇండియా-పాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంచాలని నిర్ణయించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 10న వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 11న మ్యాచ్ ను కొనసాగించనున్నారని సమాచారం. ఆసియా కప్ లో ఈ మ్యాచ్ తో పాటుగా ఫైనల్ మ్యాచ్ కు కూడా రిజర్వ్ డేని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతోనే ఏసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏసీసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Asia Cup 2023 | Asian Cricket Council says, “A reserve day has been incorporated for the Super11 Asia Cup 2023 Super 4 match between India vs Pakistan scheduled to take place on 10th September 2023 at R. Premadasa International Cricket Stadium in Colombo. If adverse weather… pic.twitter.com/gTEu7DnkuR
— ANI (@ANI) September 8, 2023