iDreamPost

వీడియో: నీతులు చెప్పడమే కాదు.. చేసి చూపించాడు! హ్యాట్సాఫ్‌ అశ్విన్‌

  • Published May 03, 2024 | 2:31 PMUpdated May 03, 2024 | 2:31 PM

Ravichandran Ashwin, SRH vs RR, IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌చేసిన ఒక పనితో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ అశ్విన్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Ravichandran Ashwin, SRH vs RR, IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌చేసిన ఒక పనితో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ అశ్విన్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published May 03, 2024 | 2:31 PMUpdated May 03, 2024 | 2:31 PM
వీడియో: నీతులు చెప్పడమే కాదు.. చేసి చూపించాడు! హ్యాట్సాఫ్‌ అశ్విన్‌

రవిచంద్రన్‌ అశ్విన్‌ అనగానే చాలా మందికి గొప్ప బౌలర్‌గా కనిపిస్తాడు. కానీ, క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వారికి.. అశ్విన్‌ అంటే మన్కడింగ్‌ గుర్తుకు వస్తుంది. ఐపీఎల్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఓ బ్యాటర్‌ను మన్కడింగ్‌ ద్వారా అవుట్‌ చేసి పెద్ద వివాదానికి తెరలేపాడు. తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత.. దాన్ని ఐసీసీ రనౌట్‌గా పరిగణించాలంటూ.. కొత్త రూల్‌ను కూడా తెచ్చింది. మన్కడింగ్‌ అంటే.. బౌలర్‌ బౌలింగ్‌ వేస్తున్న సమయంలో బాల్‌ బౌలర్‌ చేతి నుంచి రిలీజ్‌ కాకముందే.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజ్‌ వదిలి వెళ్లకూడాదు. అలా వెళ్తున్నట్లు బౌలర్‌ గమనిస్తే.. బాల్‌ రిలీజ్‌ చేయడం ఆపేసి.. అతన్ని రనౌట్‌ రూపంలో అవుట్‌ చేయవచ్చు. ఈ మన్కడింగ్‌కు నేతి తరంలో వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా అశ్విన్‌ నిలిచిపోతాడు.

అయితే.. మన్కడింగ్‌తో బట్లర్‌ను అవుట్‌ చేయడంపై తీవ్ర వివాదం చెలరేగడంతో అశ్విన్‌ను చాలా మంది విమర్శించాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అంటూ ఆరోపించారు. కానీ, అవేవి అశ్విన్‌ పట్టించుకోలేదు. కాగా, తాజాగా గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో అశ్విన్‌ చేసిన ఒక పనితో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో చివరి బాల్‌కు రాజస్థాన్‌కు రెండు పరుగులు అవసరమైన సమయంలో అశ్విన్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌ చివరి బాల్‌ కావడం, రెండు రన్స్‌ అవసరం ఉండటంతో బాల్‌ టచ్‌ అయినా.. మెరుపు వేగంతో పరిగెత్తేందుకు నాన్‌స్ట్రైకర్‌లో ఉండే బ్యాటర్‌ సిద్ధంగా ఉంటాడు. బాల్‌ వేసే ముందే ఓ రెండు అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ, అశ్విన్‌ మాత్రం బాల్‌ రిలీజ్‌ అయ్యేంత వరకు క్రీజ్‌లోనే ఉన్నాడు.

భువనేశ్వర్‌ కుమార్‌ బాల్‌ రిలీజ్‌ చేసిన తర్వాతనే పరుగుత కోసం వెళ్లాడు. చివరి బాల్‌కు రెండు రన్స్‌ అవసరమైన సమయంలో కూడా రూల్‌ ప్రకారం అశ్విన్‌ వ్యవహరించాడు. ఒక వేళ అశ్విన్‌ ముందుకు వెళ్లినా భువీ చూడకుండా బాల్‌ వేసేసి ఉంటే.. దాన్ని ఎవరు పట్టించుకోరు. అయినా కూడా అశ్విన్‌ బాల్‌ రిలీజ్‌ అయేంత వరకు క్రీజ్‌లోనే ఉన్నాడు. మన్కడింగ్‌తో బ్యాటర్‌ను అవుట్‌ చేసి.. బాల్‌ రిలీజ్‌ అయ్యేంత వరకు బ్యాటర్‌ క్రీజ్‌లోనే ఉండాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన అశ్విన్‌.. ఇప్పుడు తాను బ్యాటర్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడు దాన్ని చేసి చూపించాడు. నీతులు చెప్పడమే కాదు.. చేసి చూపిస్తాడు అశ్విన్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు అశ్విన్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అయితే.. చివరి బాల్‌కు రాజస్థాన్‌ బ్యాటర్‌ పావెల్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక రన్‌ తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ బాల్‌ రిలీజ్‌ అయ్యేంత వరకు క్రీజ్‌లోనే ఉండి.. నీతులు చెప్పడమే కాదు చేసి చూపిస్తా అన్నట్లు వ్యవహరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి