iDreamPost

AP NEWS అసని తుఫాను.. భారీ వర్షాలు.. ఏపీలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఇవే..

AP NEWS అసని తుఫాను.. భారీ వర్షాలు.. ఏపీలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఇవే..

గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ‘అసని’ తుఫాను ఏర్పడిన సంగతి తెలిసిందే. రేపు ఉదయానికి తుఫాను వాయుగుండంగా బలహీనపడనుంది. ఈ అసని తుఫానుతో ఇప్పటికే పలు ప్రదేశాలలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తుఫాను మచిలీపట్నంకు 40 కి.మీ., నరసాపురంకు 50 కి.మీ., కాకినాడకు 130 కి.మీ., విశాఖపట్నంకు 270 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. తీరం వెంబడి గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నారు. కోస్తా జిల్లాల్లో తుఫాన్ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు సీఎం. ఇప్పటికే పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మృత్సకారులని వేటకి వెళ్లోద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఈ అసని తుఫాను సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే రెండు హెల్ప్‌ లైన్‌ నెంబర్లు తెలిపారు. ఆ నంబర్లు : 1070, 18004250101 ఎలాంటి సహాయం కావాలన్నా, విపత్తు ఎదురైనా, అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లకి కాల్ చేయొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి