iDreamPost

“క‌ళ్ల‌వెంట నీళ్లు వ‌చ్చాయి” అవినీతి మంత్రిని అరెస్ట్ చేసిన‌ పంజాబ్‌ సీఎంను మెచ్చుకున్న కేజ్రీవాల్

“క‌ళ్ల‌వెంట నీళ్లు వ‌చ్చాయి” అవినీతి మంత్రిని అరెస్ట్ చేసిన‌ పంజాబ్‌ సీఎంను మెచ్చుకున్న కేజ్రీవాల్

ప్ర‌త్య‌మ్నాయ రాజ‌కీయాలంటూ పంజాబ్ లో అధికారంలోకి వ‌చ్చిన ఆప్, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంది.
అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో బ‌ర్త‌ర‌ఫ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. త‌న‌ తప్పులను సింఘ్లా ఒప్పుకున్నట్లు కూడా భ‌గ‌వంత్ మాన్ తెలిపారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ తీర్పుతో ఈయేడాది మార్చిలో పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఎర్పాటుచేసింది. అధికారంలోకి వ‌చ్చిన రెండునెల‌ల్లోనే అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మంత్రిపై, ఎలాంటి తాత్సారం లేకుండా ఒక్క వేటు వేశారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోప‌ణ‌ల విచార‌ణ చేయిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ సీఎం, సింగ్లాపై కేసు నమోదు చేయాలని పంజాబ్‌ పోలీసులను ఆదేశించారు. పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్‌ చేశారు. విచారిస్తున్నారు.

ఎక్క‌డైనా మంత్రులపై ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవు. నిజానికి టెండ‌ర్లలో క‌మీష‌న్ తీసుకోవ‌డం పెద్ద అవినీతిగా లెక్క‌వేయ‌రు. టెండ‌ర్లు ద‌క్కించుకున్న‌వాళ్లుకూడా క‌మీష‌న్ ఇవ్వ‌డానికే సిద్ధ‌ప‌డ‌తాయి. పంజాబ్ లో మాత్రం ఒక్క‌శాతం క‌మీష‌న్ కే అరెస్ట్ చేయించారు సీఎం. ఏ స్థాయి అవినీతిని కూడా స‌హించ‌బోమ‌ని చెప్ప‌డ‌మే కాదు, చేసి చూపించిన పంజాబ్ సీఎంకు సోష‌ల్ మీడియాలో ప్ర‌శంశ‌లు ద‌క్కుతున్నాయి. దేశానికి ఇలాంటి నేత‌లు కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భ‌గ‌వంత్ మాన్ ను ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మెచ్చుకున్నారు. పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌ర్య‌తో క‌ళ్ల‌వెంట నీళ్లొస్తున్నాయ‌ని అన్నారు. నిఖార్సైన ప్ర‌భుత్వాన్నిదేశంలో ఎక్క‌డైనా ఆప్ మాత్ర‌మే న‌డ‌ప‌గ‌ల‌ద‌ని నిరూపించార‌ని చెప్పారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి