iDreamPost

ఇకపై దుకాణాలు 24 గంటలు ఓపెన్! అదే కారణం..

రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటాయి. అంతేకాక ప్రభుత్వా ఖజానా పెంచుకునేందుకు వ్యాపార, ఇతర సంస్థలకు కొన్ని వెసులుబాటులు కల్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ దుకాణాలకు 24 గంటలు ఓపెన్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు.

రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటాయి. అంతేకాక ప్రభుత్వా ఖజానా పెంచుకునేందుకు వ్యాపార, ఇతర సంస్థలకు కొన్ని వెసులుబాటులు కల్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ దుకాణాలకు 24 గంటలు ఓపెన్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు.

ఇకపై దుకాణాలు 24 గంటలు ఓపెన్! అదే కారణం..

సాధారణంగా మెడికల్ దుకాణలు వంటివి తప్పించి..మిగిలినవి నిర్ధిష్ట సమయానికి ముసేస్తారు. దాదాపు అన్ని దుకాణాలు రాత్రి 11 గంటలకే క్లోజ్ చేస్తుంటారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటాయి. అంతేకాక ప్రభుత్వా ఖజానా పెంచుకునేందుకు వ్యాపార, ఇతర సంస్థలకు కొన్ని వెసులుబాటులు కల్పిస్తుంటాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలకు 24 గంటలు ఓపెన్ చేసుకునేందుకు షరతులతో కూడిన అనుమతులును మంజూరు చేసింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటోఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ సర్కార్ ఆర్థికంగా బలంగా మారడానికి కీలక చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.  ఈ నేపథ్యంలోనే  షాపులను 24 గంటలు తెరిచి ఉంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంత సొమ్ము జమవుతుందని క్రేజీవాల్ సర్కార్ భావిస్తోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ నగరంలో  83 దుకాణాలు, వాణిజ్య  సంస్థలకు 24 గంటలు పని చేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఢిల్లీలో 24 గంటలపాటు తెరిచే దుకాణాల సంఖ్య  635 కి చేరింది. గతంలో పలు దుకాణాలకు 24 గంటలు ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజగా మరికొన్ని షాపులకు కూడా ఢిల్లీ సర్కార్ అనుమతి ఇచ్చింది.

ఢిల్లీలో అరవింద్ క్రేజీవాల్ సర్కార్ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు దుకాణాలు 24 గంటలు తెరుచుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తుంది. ఇప్పటికే అనేక దుకాణాలకు.. కొన్ని షరతులతో అనుమతులు ఇస్తుంది. తాజాగా 85 షాపులకు 24 గంటలు తెరచి ఉంచేలా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.  ఈ కమిటి వద్దకు మొత్తం 122 దరఖాస్తులు వచ్చాయి.  అయితే సరైన వివరాలు వెల్లడించిన కారణంగా  29 అప్లికేషన్లను తిరష్కరించినట్లు అధికారులు తెలిపారు.

అంతేకాక నిర్ధిష్ట ప్రాంతాల్లోనే దుకాణాలను తెరచేందుకు  అనుమతించినట్లు అధికారులు తెలిపారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే.. భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.  షాపులు, వాణిజ్య సంస్థలు 24 గంటలు పని చేయడంతో నగర ఆర్థిక వ్యవస్థ  బలోపేతం అవుతుందని ఢిల్లీ సర్కార్ అభిప్రాయ పడుతోంది.  దీంతో పాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరి.. ఆదాయ మార్గాల కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి