iDreamPost

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

కరోనా దేశంలో ఉధృతంగా విస్తరిస్తోంది. సామాన్యులనే కాక ప్రముఖులను రాజకీయ నాయకులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

ట్విట్టర్ ద్వారా తనకు కరోనా పాజిటివ్ విషయాన్ని వెల్లడించిన పెమా ఖండు తనకు కోవిడ్ లక్షణాలు లేవని అయినప్పటికీ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, కానీ కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం క్వారెంటయిన్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కొద్ది రోజుల ముందు తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కలవడానికి కొండలు అడవులను కూడా లెక్క చేయలేదు. తవాంగ్ లోని ముక్తో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పెమా ఖండు పర్యటించారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కాలి నడకన నియోజక వర్గంలో పర్యటించారు. ఇందుకోసం ఏకంగా 24 కిలోమీటర్లు నడిచారు. కొండలు గుట్టలు ఎక్కారు. దాదాపు 11 గంటలు శ్రమించి లుగు థాంగ్ అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి ఏకంగా 24 కిలోమీటర్లు నడిచి వెళ్లడం మీడియాలో వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి